Friday, 4 January 2019

నంబాల శివాలయంలో చోరీ


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  04 :  రెబ్బెన మండలం నంబాల గ్రామా శివారులో ఉన్న ప్రసన్న పరమేశ్వర దేవాలయంలో గురువారం రాత్రి గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు.  . దేవాలయంలో ఉన్న హుండీ ని పగులగొట్టడానికి  విఫలప్రయత్నం చేశారు.  దేవాలయ సిబ్బంది ద్వారా  విషయం తెలుసుకున్న పోలీసులు శుక్రవారం ఉదయం  సంఘటన జరిగిన దేవాలయానికి ఆసిఫాబాద్ డి ఎస్ పి సత్యనారాయణ , రెబ్బెన సర్కిల్ ఇన్సపెక్టర్  రమణ మూర్తి , ఎస్సై దీకొండ  రమేష్, డాగ్ స్క్వాడ్, క్లూస్  టీం లతో వెళ్లి  వివరాలు సేకరించారు. రెబ్బెన మండలంలో స్వయంభు దేవాలయంగా ప్రఖ్యాతి చెందిన దేవాలయంలో దొంగతనం జరగడంతో మండలంలోని ప్రజలు తీవ్ర ద్రిగ్భ్రాంతికి లోనయ్యారు. డి ఎస్ పి  ఆలయ కమిటీ తో మాట్లాడి ఆలయ ప్రాంగణంలో సి సి కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. విచారణ చేపట్టి  నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. 

No comments:

Post a Comment