Friday, 18 January 2019

ఎన్ ఎస్ ఎస్ శిబిరం ముగింపు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  18   రెబ్బెన  మండలంలోని సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాల విద్యార్థుల ఎన్  ఎస్ ఎస్ శిబిరం  ముగింపు  రోజు ఇందిరానగర్ పంచాయాతి  లోని నక్కాలగూడా గ్రామంలో  కొనసాగింది. ఈ సందర్భంగా అక్షరాస్యత పై అవగాహనా ర్యాలీ  నిర్వహించారు. అనంతరం నక్కాలగూడా నుండి పొలాలకు వెళ్లే దారికిరువైపులా పేరుకుపోయిన ,  పొదలను శుభ్రం చేశారు.  నక్కలగు డా పాఠశాల విద్యార్థులకు క్విజ్ పోటీ నిర్వహించి  ప్రధమ , ద్వితీయ, తృతీయ బహుమతులను అందచేశారు.    ఈ కార్యక్రమంలో ప్రొగ్రమ్మె ఆఫీసర్ డి దేవాజి,  కాలేజీ ప్రిన్సిపాల్ జాకిర్ ఉస్మాని,   కాగజ్ నగర్  జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీధర్ సుమన్, నక్కలగూడ  పాఠశాల ప్రధానోపాధ్యాయులు కల్వల  శంకర్,  ,  అధ్యాపకులు పూదరి  మల్లేష్, గణేష్ , స్వప్న,త్రివేణి  ,ఉప్పులేటి  మల్లేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment