Friday, 4 January 2019

రాష్టస్థ్రాయి పోటీల్లో పతకాలు సాధించాలి

   కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  04 : రాష్ట్ర స్థాయి చెకుముకి పోటీలకు ఎంపికైన విద్యార్థులు అత్యంత ప్రతిభ చూపి పతకాలు సాధించాలని బెల్లంపల్లి ఏరియా ఇంచార్జ్  జిఎం సాయిబాబా అన్నారు. రెబ్బెనలోని గోలేటి టౌన్ షిప్ లో శుక్రవారం ఉదయం జిఎం కార్యాలయంలో రాష్ట్ర స్థాయి చెకుముకి పోటీలకు ఎంపికైన ఎస్ వి  ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు దుర్గం వర్షిత, సిఎచ్ కనుక లక్ష్మి, వై హర్షవర్ధన్లును అభినందించారు.  ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ  చెకుముకి పోటీలలో ఎస్వి ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలవటం గర్వకారణమన్నారు అదే స్ఫూర్తి పట్టుదలతో ఈ నెల ఐదు నుంచి ఏడవ తేదీ వరకు వరంగల్లో జరగబోయే  రాష్ట్ర స్థాయి చెకుముఖి సైన్స్ పోటీల్లోనూ పతకాలను సాధించి విద్యార్థులు అందరికీ ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిజిఎం పర్సనల్ కిరణ్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు దికొండ  సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment