Thursday, 24 January 2019

పశువులకు నట్టల నివారణకు టీకాలు ఎంతో అవసరం

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  24 పశువులకు నట్టల  నివారణకు టీకాలు ఎంతో అవసరమని  వాటితో రైతులకు ఎంతో లాభం చేకూరుతుందని జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ శంకర్ రాథోడ్ అన్నారు.  గురువారం రెబ్బెన మండలం లోని  ఇందిరా నగర్ లో  పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో నట్టలనివారణ టీకాలను పశు పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు.  జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ శంకర్ రాథోడ్ తో  పాటు ఆదిలాబాద్ జిల్లా డిఎల్డిఎ రాజేశ్వర్లు ఈ శిబిరాన్ని సందర్శించారు.  అనంతరం వారు మాట్లాడుతూ నట్టల  నివారణ టీకాలు పంపిణీ మూలంగా గొర్రెలు మేకలు అంతర్ పరాన జీవుల బెడదను నివారించేందుకు , మరియు  పశువులు మేత పై ఆసక్తి చూపుతాయని తీసుకున్న ఆహారం స సైతం పూర్తిస్థాయిలో జీర్ణమై తుందన్నారు. దీంతో గొర్రెలు మేకలు ఆశించిన పెరుగుదలను సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన మండల  పశువైద్యాధికారి డాక్టర్ సాగర్, విశ్వనాథ్,  సిబ్బంది తదితరలు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment