Thursday, 3 January 2019

రైలు కిందపడి ఆత్మహత్య

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  03 : రెబ్బెన మండల కేంద్రంలోని ఆసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్లో గుర్తుతెలియని రైలు కిందపడి నక్క శ్రీనివాస్ (36) ఆత్మహత్యకు పాల్పడ్డాడని కాగజ్ నగర్ జీఆర్పీ హెడ్  కానిస్టేబుల్ సురేష్ గౌడ్ తెలిపారు.  ఆయన తెలిపిన వివరాల ప్రకారం కాగజ్ నగర్  పరిధిలోని సంఘం బస్తీకి చెందిన నక్క శ్రీనివాస్ (36) కుటుంబ కలహాల కారణంగా బుధవారం రాత్రి రెబ్బెన మండల కేంద్రంలోని ఆసిఫాబాద్ రోడ్డు రైల్వే స్టేషన్లో గుర్తుతెలియని  రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు.  శ్రీనివాస్ కు సిద్దిపేట జిల్లా అక్కేనపల్లి  చెందిన కవితతో రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది కొన్నాళ్లపాటు వీరి కాపురం సజావుగానే  సాగగా గత దసరా పండుగకు భా ర్యాభర్తలిద్దరూ అక్కన్నపల్లి కు వెళ్లారు అక్కడ స్థానికులు కవిత ప్రవర్తన సరిగ్గా లేదని శ్రీనివాస్ కు చెప్పడంతో అప్పటినుంచి కవితపై అనుమానం పెంచుకున్నాడు.  ఈ విషయంపై భార్యను నిలదీసిన శ్రీనివాస్ కోపంతో భార్యపై చేయి చేసుకున్నాడు ఆ తర్వాత సంగం బస్తీకి చేరుకున్న భార్యాభర్తల మధ్య కలహాలు సమసిపోలేదు.  దాంతో పెద్దల సమక్షంలో పంచాయితీలు పెట్టి కవిత తన పుట్టింటికి వెళ్ళిపోయింది.  దాంతో  తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీనివాస్ జీవితంపై విరక్తి చెంది ఈ నెల ఒకటో తేదీన కుటుంబ సభ్యులతో మంచిర్యాలకు  వెళ్లి వస్తానని చెప్పి ఇంట్లో నుండి బయలుదేరాడు.  బుధవారం ఉదయం అమ్మ తమ్ముడు జాగ్రత్త సారీ అంటూ తన తమ్ముడికి  మెసేజ్ చేసి స్విచ్చాఫ్ చేశాడు.  దాంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు శ్రీనివాస్ కోసం పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకి తెలియలేదు.  ఈ క్రమంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని రైలు కింద పడి ఆసిఫాబాద్  రైల్వే స్టేషన్లో ఒకరు ఆత్మహత్యకు పాల్పడినట్లు అందిన సమాచారం మేరకు గురువారం ఉదయం సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించామన్నారు.  మృతుడి పర్సులో లభించిన ఆధార్ కార్డు ఆధారంగా శ్రీనివాస్ గా  గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు తెలిపారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నటు పేర్కొన్నారు.

No comments:

Post a Comment