Thursday, 3 January 2019

సావిత్రి భాయి పూలే 188 వ జయంతి వేడుకలు

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, జనవరి  03 : రెబ్బెన మండలం లో ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో బెటర్ యూత్ బెటర్ సొసైటీ  స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సావిత్రి భాయి పూలే 188 వ జయంతి సందర్భంగా ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేశారు. సందర్భంగా సంస్థ అధ్యక్షులు ఓరగంటి రంజిత్ మాట్లాడుతూ కుల మతా లకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి.. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి.. కిందికులాలను బానిసలుగా చూస్తున్న ఆ రోజుల్లో బహుజనుల కోసం బడి పెట్టి పాఠాలు చెప్పిన చదువుల తల్లి సావిత్రి భాయిఫూలే. అని అన్నారు. మనదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, మహిళలకు మొదటి పాఠశాల స్ధాపించిన, సంఘ సంస్కర్త సావిత్రీబాయి పూలే. అని అన్నారు. సావిత్రి భాయి పూలే చరిత్ర ని విద్యార్థులకు వివరించి ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకొని వారి అడుగు జడలలో నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రదానోపాద్యులు స్వర్ణలత గారు సంస్థ ప్రధాన కారుదర్శి గజ్జల సత్యనారాయణ ఉపాధ్యక్షులు రవీందర్ సభ్యులు పెంటపర్తి తిరుపతి,రాజశేఖర్,వేల్పుల తిరుపతి పాఠశాల ఉపాధ్యాయులు మోగిలి,శ్రీకాంత్,తుకరం,చంద్రశేఖర్,చారందస్,అన్నీస్,జమునదాస్,వసీమ్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment