Friday, 30 November 2018

స్వేచ్చాయుత వాతావరణంలో ఓటును వినియోగించుకోవాలి

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, నవంబర్ 30 : అసెంబ్లీ ఎన్నికలలో ఓటర్లు స్వేచ్చాయుత వాతావరణంలో   ఓటు హక్కు వినియోగించుకోవాలని  రెబ్బెన ఎస్సై దీకొండ  రమేష్  అన్నారు.అసెంబ్లీ  ఎన్నికలను దృష్టిలోపెట్టుకొని ఓటర్లలో భరోసా కల్పించడానికి  పోలీసులు  శుక్రవారం  రెబ్బెన మండలంలోని నార్లాపూర్, నంబాల,  గ్రామాలలో  ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ   సమాజంలోని ప్రజలకు ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ భద్రత కల్పిస్తుందని పోలింగ్ రోజు శాంతియుత వాతావరణం కల్పిస్తామని అన్నారు. ,ప్రజలు తమ ఓటు హక్కును స్వేచయుతంగా వినియోగించుకోవాల్సిందిగా కోరారు. .  రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో పారామిలటరీ    . 

Wednesday, 28 November 2018

తెరాస కు జిల్లా కుమ్మరి సంఘం మద్దతు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, నవంబర్ 28 : తెలంగాణ రాష్ట్ర కుమ్మర  సంఘము నిర్ణయానికి అనుగుణంగా  కొమురం భీమ్ జిల్లా కుమ్మర సంఘము తెరాస పార్టీకి రానున్న శాసనసభ ఎన్నికలలో మద్దతుప్రకటిస్తున్నామని   కొమురం భీమ్ జిల్లా కుమ్మర సంఘము అధ్యక్షులు కుమ్మరి. మల్లేష్ అన్నారు. రెబ్బెన మండల కేంద్రంలో  బుధవారం విలేఖరులతో మాట్లాడారు. రానున్న రోజుల్లో తెరాస అభ్యర్థి  కోవ.లక్మి  మా కోరిక మేరకు మాకు అన్ని విధాలుగా కుమ్మర సంఘానికి సహకారం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకొని మేము మా కొమురం భీమ్ జిల్లా కుమ్మర సంఘము అందరం        తెరాస   పార్టీ కి   మద్దతు  చేస్తున్నామన్నారు. .ఈ కార్యక్రమంలో. జిల్లా ప్రధాన కార్యదర్శి. మొండి,జిల్లా యూత్ అధ్యక్షులు. యూ.మల్లేష్. ఎర్ర. సురేష్ జిల్లా ఉపాధ్యక్షులు. ఎర్ర మహేష్, విలసాగర్. రమేష్, ఎర్ర.సంతోష్, ఎర్ర.తిరుపతి (తిర్యాని) వాంకిడి మండల అధ్యక్షులు. నిలేష్, పెంటయ్య, పోషన్న, అసిఫాబాద్ మండలం అధ్యక్షులు మొగదింపుల. సుధాకర్, రెబ్బెన మండల అధ్యక్షులు. ఎర్ర. రమేష్.ఎర్ర. రాజేష్.ఎర్ర.సురేష్ పాల్గొన్నారు.

కెసిఆర్ ఎన్నికల బహిరంగ సభకు సింగరేణి కార్మికులు భారీగా తరలాలి : ఎం శ్రీనివాస్ రావు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, నవంబర్ 28 :  ఆసిఫాబాద్  జిల్లా కేంద్ర0లో నేడు జరగనున్న కెసిఆర్ ఎన్నికల  బహిరంగ సభకు సింగరేణి కార్మికులు భారీగా  తరలివచ్చి సభను జయప్రదం చేయాలని బెల్లంపల్లి ఏరియా టిబిజికెఎస్ ఏరియా ఉపాధ్యక్షులు  ఎం శ్రీనివాస్ రావు బుధవారం పిలుపునిచ్చారు

పతంజలి యోగ ఆధ్వర్యంలో ఉచిత యోగ శిబిరం

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, నవంబర్ 28 : పతంజలి యోగ  హరిద్వార్ వారి ఆధ్వర్యంలో రెబ్బెన మండలం నారాయణ పూర్ గ్రామంలో ఐదురోజుల ఉచిత యోగా శిక్షణ శిబిరం  నిర్వహించడం జరుగుతుందని దాసరి వినోద్ గౌడ్  ఈ   శిబిరం డిసెంబర్  1 వ తారీకు నుండి 5వ తారీఖు వరకు ఉదయం సమయం 5 గంటల 30 నిమిషాల నుంచి 7 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ   యోగా చేయడం వల్ల శారీరకంగా ఆరోగ్యంగ ఉంటామని   మానసికంగా ప్రశాంతంగా ఉంటారు అని  అన్నారు.ఈ  అవకాశాన్ని గ్రామస్తులు   సద్విని యోగం చేసుకోవాలని  కోరారు. .   ఈ కార్యక్రమంలో గ్రామ వాసులు రవీందర్ , మైలారం వెంకటేశం , తనుకు జగదీష్, తనుకు మురళి , తనుకు తిరుపతి , తనుకు రామన్న , బోనగిరి రమేష్ , రాయల శ్రీనివాస్ , గజ్జల సుజన , గజ్జల శ్రీశైలం ,పుల్లూరు వసంత ,  దేవినేని ప్రహ్లాద్,  ఆర్ఎంపీ డాక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

పార్టీల ఎన్నికల ప్రచారం

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, నవంబర్ 28 : శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎన్నికల ప్రచారం రెబ్బెన మండలంలో ఊపందుకుంది. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మండల స్థాయి నాయకులు ఇంటింటికి తిరిగి తమ తమ పార్టీ అభ్యర్థులను గెలిపించమని ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్, తెరాస పార్టీలకు చెందిన శ్రేణులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు  కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోను సామాన్య ప్రజలకు చేరువ చేయడానికి కృషి చేస్తున్నారు. తెరాస పార్టీ కార్యకర్తలు గత నాలుగేళ్లలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చిందని చెపుతూ తమ అభ్యర్థిని గెలిపించలని  ప్రచారం నిర్వహిస్తున్నారు.

మహాత్మా జ్యోతి బా పూలే 128 వర్ధంతి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, నవంబర్ 28 : మహాత్మా జ్యోతి బా పూలే 128 వర్ధంతి సందర్భంగా  రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామంలో మాలి కులస్తులు గ్రామ మాలి సంఘం అధ్యక్షులు లెందుగురే జయరాం ఆధ్వర్యంలో  ఘనంగా  నివాళులు అర్పించారు. కులస్తులందరు అధిక సంఖ్యలో హాజరై నివాళు లర్పించారు.  ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఎల్ బాపు రావు, కమిటీ సభ్యులు జి చంద్రయ్య, వాసబెత్ రావు, శంకర్, విలాస్, కే శంకర్, గుండయ్య, ఆనంద్ రావు, భీమయ్య, తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా రెబ్బెన మండల కేంద్రంలో ఏ  ఐ ఎస్ ఎఫ్ నాయకులూ దుర్గం రవీందర్, బోగే ఉపేందర్, పూదరి సాయి, పర్వతి సాయి, రాయిలా నర్సయ్య తదితరులు ,  మహాత్మా జ్యోతి బా పూలే చిత్రపటానికి నివాళులు అర్పించారు.  

Monday, 26 November 2018

శాంతియుతంగా జీవిస్తున్నారంటే అది మన రాజ్యాంగ ఫలమే


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, నవంబర్ 26 :  వివిధ కులాల మతాల సంస్కృతుల ప్రాంతాల భారతీయులు  శాంతియుతంగా జీవిస్తున్నారంటే అది మన రాజ్యాంగ  ఫలమే అని  జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ బొల్లారం బిక్షపతి అన్నారు. సోమవారం  రెబ్బెన మండలం నక్కల గూడ   ప్రాథమిక పాఠశాలలో 69వ భారత రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా హాజరై .  భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.  అనంతరం  విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ భారతదేశానికి  సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర ప్రతిపత్తిని అందించిన ఘనత మన రాజ్యాంగం దేనని అన్నారు.  మండల విద్యాధికారి వెంకటేశ్వర స్వామి మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రచించడంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి కృషి కొనియాడదగినది అని తెలియజేశారు పిఆర్టియు జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్  మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు పట్టిందని రాజ్యాంగ రచనలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దార్శనికత నేటికీ సజీవంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా భారత రాజ్యాంగం విషయాలపై  నిర్వహించిన ఉపన్యాస, క్విజ్  పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.  జిల్లా విద్యాధికారి శ్రీ బిక్షపతిని ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు అనంతరం విద్యార్థులకు గ్రామర్ బుక్స్ డిక్షనరీలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి విద్యా కమిటీ చైర్మన్ మీసాల  పోష మల్లు పిఆర్టియు జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల సదానందం,  ఖాదర్ మొహియుద్దీన్ మండల ప్రధాన కార్యదర్శి ఎస్.అనిల్   డి రవికుమార్  బొంగు శ్రీనివాస్  పాఠశాల ప్రధానోపాధ్యాయులు కల్వల శంకర్ ఉపాధ్యాయులు దేవరకొండ రమేష్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.అదే విధంగా మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 

Saturday, 24 November 2018

లారీలలో ఓవర్ లోడ్ ఇవ్వవద్దని జీఎం కు వినతి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, నవంబర్ 24 : లారీ ల  ఆర్ సీ  ప్రకారం బొగ్గు లోడ్ ను నింపాలని సింగరేణిలో బొగ్గు సరఫరా చేసే  కాంట్రాక్టు లారీ యజమానులు ఎన్  ప్రభాకర్, సి హెచ్ రంగారావు ల ఆధ్వర్యంలో శనివారం రెబ్బెన  బెల్లంపల్లి సింగరేణి ఏరియా జీఎం కే రవిశంకర్ కు    వినతి పత్రం అందచేశారు. అనంతరం లారీ యజమానులు  మాట్లాడుతూ ఓవర్ లోడ్ చేయడం వలన లారీ లకు బ్రేకులు సరిగా పడక మార్గమధ్యంలో ప్రమాదాలకు కారణమవు తున్నామని, ప్రజల ప్రాణాలకు హాని జరుగుతుందని, ఏదైనా ప్రమాదం జరిగితే యజమానులు ఆర్ధికంగా నష్టపోవలసి వస్తున్నదని, కుటుంబ పోషణ భారమౌతున్నదని, డ్రైవర్లకు, క్లీనర్లకు జీతభత్యాలు సరిగా చెలించలేని పరిస్థితి రావడంతో కొంతమంది యజమానులు ఆత్మహత్య ప్రయత్నాలు కూడా చేశారని కావున దయవుంచి లారీ అర్ సి ప్రకారం సింగరేణి సంస్థ బొగ్గును నింపాలని  కోరారు.   ఈ కార్యక్రమంలో లారీల యజమానులు  సతీష్, వెంకన్న, పోశెట్టి, మహేష్, రాజన్న, ప్రసాద్, కార్తిక్, తిరుపతి, అశోక్, రమేష్, మధుకర్, జగదీష్  తదితరులు ఉన్నారు. 

ప్రజలను వంచించిన తెరాస ను ఓడించాలి ; విశ్వ ప్రసాద్

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, నవంబర్ 24 :  పాలన చేతగాక చేసిన వాగ్దానాలను అమలు చేయకుండా ప్రజలను వంచించి మధ్యంతర ఎన్నికలకు వెళ్లిన కెసిఆర్ నాయకత్వంలోని తెరాస ను చిత్తుగా ఓడించాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ కె విశ్వ ప్రసాద్ అన్నారు.   రెబ్బెన కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గంగాపూర్  గ్రామస్తులు ఓల్వోజు వెంకటేశం చారి అధ్యర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే  కొమురం భీమ్ జిల్లా కుమ్మర సంఘము అధ్యక్షులు కుమ్మరి. మల్లేష్, రెబ్బెనకు చెందిన తెరాస మండల మహిళా  కార్యదర్శి అన్నపూర్ణ అరుణ లు  కాంగ్రెస్ పార్టీ లో చేరారు.    వారికి  జిల్లా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ కె విశ్వ ప్రసాద్ డిసిసి ఉపాధ్యక్షుడు పల్లె ప్రకాష్ రావులు  కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ .కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించడం వల్ల ముందుగా రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ, ఐదు లక్షల రూపాయల రైతు భీమా. వృద్దులకు,వికలాంగులకు,వితంతువులకు 2 వేల  నుండి   3 వేల  రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని,   డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులకు3 వేల  నిరుద్యోగ భృతి ఉద్యోగం వచ్చే వరకు అందజేయడం జరుతుందని అదేవిదంగా ప్రతి పేదింటి వారికి సంవత్సరానికి ఆరు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని ,మహిళలకు వడ్డీ లేని రుణాలు పది లక్షల వరకు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  ముంజం రవీందర్ సింగల్ విండో చైర్మన్ గాజుల రవీందర్, బీసీ సెల్ మండల అధ్యక్షులు అనిశెట్టి వెంకన్న, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు గుర్లే రామచందర్, ముంజం వినోద్,  గందె సంతోష్,  ఇగురపు రవీందర్,  ముంజం శ్యామరావు,  మదన్,  కిషన్,   లెండుగురే అనిల్ కుమార్   తదితరులు పాల్గొన్నారు.

ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి ; డి ఎస్ పి సత్యనారాయణ


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, నవంబర్ 24 : అసెంబ్లీ ఎన్నికలలో ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని  డి ఎస్ పి  సత్యనారాయణ అన్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలోపెట్టుకొని ఓటర్లలో భరోసా కల్పించడానికి  పోలీసులు  శనివారం రెబ్బెన మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై,  గోలేటిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డి ఎస్ పి  సత్యనారాయణ మాట్లాడారు. సమాజంలోని ప్రజలకు ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ భద్రత కల్పిస్తుందని,ప్రజలు తమ ఓటు హక్కును స్వేచయుతంగా వినియోగించుకోవాల్సిందిగా తెల్పారు.  రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు.ప్రజాస్వామ్య పద్దతిలో సామాన్యుడి  వద్ద ఉన్న   ఉన్న ఒకే ఒక్క ఆయుధం  వోట్ హక్కు అని  దానిని  ఎటువంటి ప్రలోభాలకు లోనుగాకుండా సక్రమంగా వినియోగించుకోవాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో రెబ్బెన సర్కిల్ ఇన్సపెక్టర్  రమణ మూర్తి, ఎస్సై దీకొండ   రమేష్ , సిబ్బంది ఉన్నారు.   

Thursday, 22 November 2018

తెరాస మహిళా విభాగం నుంచి ఇంటింటా ప్రచారం

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన, నవంబర్ 22 : తెరాస మహిళా విభాగం నుంచి ఇంటింట ప్రచార కార్యక్రమాన్ని గురువారం రెబ్బెన మండల కేంద్రంలో ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ కుందారపు శెంకరమ్మ ఇంటింట బొట్టు కార్యక్రమాన్ని నిర్వహించి ఓట్లను అభ్యర్థించారు. ఆసిఫాబాద్ నియోజకవర్గ అభ్యర్థి కోవాలక్ష్మి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సుదరంగా మాట్లాడుతూ రెబ్బెన గ్రామాన్ని కోవాలక్ష్మి దత్తత తీసుకుని మండల కేంద్రంలోని సుమారు రెండు కోట్లుకు పైగా అభివృద్ధి పనుల చేసారన్నారు. గత ప్రభుత్వాలు చేయలేని అభిబుద్ధి పనులు తెరాస ప్రభుత్వం చేసిందని మళ్లీ ప్రజలు ఆదరించి తెరాసను గెలిపించాలని కోరారు. మహిళలకు అండగా ఉంటూ మహిళల సమస్యలెన్నో పరిష్కరించారని, కారు గుర్తుకే ఓ ఓటు వేసి మహిళలంతా అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అందని గుడ్లు, భోజనం

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 22 : రెబ్బెన మండలం నవేగం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో గత 15 రోజులుగా పిల్లలకు భోజనం , గుడ్లు ఇవ్వడం లేదని పిల్లల తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం  చేశారు.. తమ పిల్లలు  ఇంటినుండి అంగన్వాడీ కేంద్రానికి భోజనం  తీసుకోని వెళ్లి మధ్యాహ్న సమయంలో తింటున్నారని , వారికి ఇవ్వవలసిన గుడ్లు, భోజనం నిర్వాహకులు అందచేయడం లేదని అన్నారు. సంభందిత అధికారులు తక్షణం స్పందించి అంగన్వాడీ కేంద్రంలో అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని    కే తానుబాయి  , వనజ, మహాత్మా, రేణుక, ఎం రాకేష్, భీంరావు, సతీష్, ఆనంద్, బోరుకుతే శ్యామ్ రావు, ఆనంద్, పిల్లల తల్లి తండ్రులు  తదితరులు కోరారు.

ఏఐఎస్ఎఫ్ ఆసిఫాబాద్ డివిజన్ కార్యదర్శిగా పర్వతి సాయి

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 22 : ఏఐఎస్ఎఫ్ ఆసిఫాబాద్ డివిజన్ కార్యదర్శిగా రెబ్బెన మండలం నంబాల గ్రామానికి చెందిన పర్వతి సాయిని ఎన్నుకోవడం జరిగిందని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షలు ,కార్యదర్శులు వికాస్,  దుర్గం రవీందర్ లు  తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలో జరిగిన  జిల్లా కమిటీ సమావేశంలో ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. పర్వతి సాయి విద్యారంగ సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ విద్యార్థులకు అందుబాటులో ఉంటున్నాడని అన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పర్వతి సాయి మాట్లాడుతూ విద్యారంగ సమస్యలపై ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అలుపెరుగని పోరాటం నిర్వహిస్తానని, విద్యారంగంలో ప్రభుత్వాలు తీసుకొస్తున్న విద్య ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణకు వ్యతిరేకంగా విద్యార్థులను చైతన్య పరిచి విద్యార్థులహక్కుల సాధనకై  పోరాటాలు కొనసాగిస్తానని అన్నారు. తనపై నమ్మకంతో డివిజన్  కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు జిల్లా కమిటీ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పూదరి సాయి తదితరులు  పాల్గొన్నారు.

విద్యార్థులకు 24 న చెకుముకి టాలెంట్ టెస్ట్

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 22 : జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రెబ్బెన మండలంలోని   పాఠశాల ల విద్యార్థులకు ఈ నెల 24  న చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించబడుతుందని టివివి జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి రవికుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ టెస్టు ఎనిమిది తొమ్మిది మరియు పదో తరగతి విద్యార్థులకు సైన్స్, గణితం  , సాంఘిక, సమకాలిన  సైన్స్ అంశాలపై చర్చ ఉంటుందని పేర్కొన్నారు. .  పాఠశాలల స్థాయిల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు మండల స్థాయి పరీక్ష ఈ నెల 27 న  ఉంటుందని,  డిసెంబరు 16 న  రాష్ట్రస్థాయి  పరీక్షలు జనవరి 5, 6, 7  తేదీల్లో నిర్వహించబడుతుందని తెలిపారు.

Tuesday, 20 November 2018

ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోండి.

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 20 :  బెల్లంపల్లి సింగరేణి ఏరియా లోని నిరుద్యోగ యువత కు సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో జి ఎం ఆర్ ఫౌండేషన్ శంషాబాద్ వారు ఉచిత శిక్షణను అందించనున్నట్లు డిజిఎం  పర్సనల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డ్రైవాల్స్, ఫాల్స్ సీలింగ్,  రెఫ్రిజిరేషన్, హౌస్ వైరింగ్,సోలార్ పనెల్ రిపేర్, వెల్డింగ్    తదితర విభాగాలలో  శిక్షణ అందించనున్నారు అని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు  నవంబర్ 24 లోగా పర్సనల్ డిపార్టుమెంట్  లో  తమ ఆధార్ కార్డు, వయసు నిర్ధారణ కాపీ లతో దరఖాస్తు  చేసుకోవాలనికోరారు. . శిక్షణా కాలంలో ఉచిత భోజన, వసతి కల్పించబడుననని తెలిపారు. ,

కార్మిక వ్యతిరేక తెరాస ను ఓడించాలి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 19 :   కార్మిక వ్యతిరేక  విధానాలు అమలు పరుస్తున్న తెరాస ను   ఓడించాలని  ఏఐటీయూసీ  రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్  పిలుపునిచ్చారు. సోమవారం రెబ్బెన మండలం గోలేటిలోని  ఏఐటీయూసీ   జిల్లా ప్రధాన కార్యదర్శి  రచ్చ బాబు ఆధ్వర్యంలో కెఎల్ మహేంద్ర భవన్ లో జరిగిన  జిల్లా కార్యవర్గంసమావేశం లో మాట్లాడారు. డిసెంబర్ ఏడవ తేదీన జరిగే ఎన్నికల్లో కార్మిక వ్యతిరేక విధానాలు అమలుపరచి  కార్మిక చట్టాలను అమలు చేయడంలో ఘోరంగా విఫలం అయిన  టీఆర్ఎస్ పార్టీని ఓడించాలని ఐటీసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ అన్నారు.     నాలుగు సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ఎన్నికల హామీలను అమలు పరచడంలో విఫలమైందని,  కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని కనీస వేతనం పద్దెనిమిదివేల చెల్లించాలని చెప్పారు అధికారంలోకి వచ్చిన తరువాత పట్టించుకోవడం  లేదని తాము  రాష్ట్ర సాధనలో కార్మిక పాత్ర అత్యంత కీలకమని అన్నారు.  కార్మికుల సంక్షేమం  కోసం కెసిఆర్ మాట్లాడిన రోజు లేదని రాబోయే ఎన్నికల్లో మహాకూటమి గెలుపు ఖాయమని అన్నారు.   మహాకూటమి లోని అందరు అభ్యర్థులను  గెలిపించుకుంటామన్నారు. యూనియన్  నియమ నిబంధనలను పాటించని . పలువురిని  ఏఐటీయూసీ  నుండితొలగించామన్నారు.   కార్మిక వ్యతిరేక విధానాలను అమలు పరుస్తున్న  జిల్లా అధ్యక్షుడు అంబాల ఓదెలు ,  ఉపాధ్యక్షులు సీ  హెచ్ శంకర్ జిల్లా కార్యదర్శి రాజాగౌడ్,  జిల్లా కౌన్సిల్  సభ్యుడు శివాజీలను ఏఐటీయూసీ  నుంచి తొలగిస్తున్నామని  రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ తెలిపారు . వీరందరూ కాగజ్ నగర్లో యూనియన్ నియమ నిబంధనలకు వ్యతిరేకం గా పనిచేస్తున్నందుకు తొలగించామని చెప్పారు.  ఈ కార్యక్రమంలో  సిపిఐ జిల్లా కార్యదర్శి బద్రి సత్యనారాయణ, ఏఐటీయూసీ జిల్లాప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్, జిల్లాకార్యదర్సులు జగ్గయ్య , మచ్చ బాపు, కోశాధికారి దుర్గం వెంకటేష్, కార్యవర్గ సభ్యులు ఎస్ తిరుపతి, హేమాజీ తడిఆరులు పాల్గొన్నారు. 

ప్రమాదాల నివారణకు సహకరించాలి


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 20 : రోడ్ ప్రమాదాల నివారణకు  ప్రజలు సహకరించాలని ఎస్సై ఢీకొంది రమేష్ అన్నారు. రెబ్బెన మండల కేంద్రంలో ప్రధాన రహదారికి ఇరవైపులా ఉన్న చిరు వ్యాపారస్తులు, కూరగాయల వర్తకులతో మంగళవారం  ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.  జాతీయ రహదారి కి దగ్గరగా  ఈ వ్యాపార సంస్థలు ఉండటం వలన  ట్రాఫిక్ కు అంతరాయమవుతుందని  ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారని అన్నారు. రెబ్బెన గ్రామ  పంచాయతీ కార్యదర్శితో, మండల తహసీల్దార్ తో మాట్లాడి ప్రత్యాన్మాయ   ఏర్పాటు చేస్తామని అన్నారు. వ్యాపారస్తులు సహకరించాలని కోరారు. అలాగే  రెబ్బెన బస్సు స్టాండ్  ప్రయాణ ప్రాంగణంలో ఉన్న ఫ్లెక్సీలను తొలగించి, ప్రాంగణానికి ఎదురుగానున్న కొబ్బరి బోండాల బండిని తొలగించరు. 

Sunday, 18 November 2018

పార్టీ కోసం నిజాయితితో పనిచేసేవారికి తెరాస లో గుర్తింపు లేదు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 18 : పార్టీ కోసం నిజాయితితో పనిచేసేవారికి తెరాస లో గుర్తింపులేదని  రెబ్బెన  మాజీ జడ్పీటిసి దుర్గం సోమయ్య, గంగాపూర్  మాజీ సర్పంచ్ లెండుగూరి గంటు  మేర లు  అన్నారు.  తెరాస పార్టీ కి రాజీనామా చేసినట్లు తెలిపారు. ఆదివారం విలేఖరులతో మాట్లాడుతూ  ప్రజా సమస్యలు పట్టించుకోవడంలో తెరాస  ప్రజాప్రతినిధులు విఫలమవటంతో పాటు పార్టీ కోసం గత ఐదు సంవత్సరాలుగా ఎన్నో సేవలు చేసిన గుర్తింపు లేకపోవడంతో తమతో పాటు గంగాపూర్ మాజీ ఎంపీ టీసీలు లక్ష్మి బాయి , లెందుగురే పోచుబాయి లు సైతం టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు .  ఎన్నికల్లో ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యలు  పట్టించుకోవడంలేదన్నారు.  భూ సర్వేతో కొత్త పాస్ పుస్తకాలు రాక మండలాల్లో ముప్పై అయిదు శాతం రైతులు వ్యవసాయ రుణాలకు దూరమయ్యారని అన్నారు . పాసు పుస్తకాలు లేక కొత్త పహాణీలు పొందకపోవడంతో రైతు బంధు పథకానికి అనర్హులుగా మారారని పాసుపుస్తకాల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న పట్టించుకోవటం లేదన్నారు.  భూసర్వే మూలంగామండలం లోని గోలేటి,  నంబాల , గంగాపూర్,  తుంగేడ   తక్కలపల్లి గ్రామాల్లో అటవీ భూమి పేరుతో వందలాది మంది రైతులకు అన్యాయం జరిగిందన్నారు.  రైతులను టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు.   అయినప్పటికీ పార్టీ కోసం పాటుపడుతున్నా పారాచూట్ నాయకులను అందలం ఎక్కించినందుకు   నిరాశకు గురై పార్టీని వీడుతున్నట్లు తెలిపారు.

బీజేపీ ఇంటింటి ప్రచారం

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 18 :  బీజేపీ ఇంటింటి ప్రచారం కార్యక్రమన్నీరెబ్బెన మండల కేంద్రంలో  జ్ బి పౌడెల్, బీజేపీ ఆసిఫాబాద్ అభ్యర్థి ఆత్మారాం నాయక్ లు ఆదివారం నిర్వహించారు.   రానున్న ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.  మండలానికి చెందిన తెరాస   కార్యకర్తలు బీజేపీ లో కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించామని తెలిపరు.  ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కేసర ఆంజనేయులు గౌడ్,  జిల్లా కార్యదర్శి సుదర్శన్ గౌడ్,  అసెంబ్లీ కన్వీనర్ గుల్బమ్ చక్రపాణి,  మండల అధ్యక్షుడు కుందారపు  బాలకృష్ణ, బీజేపీ కిసాన్ మోర్చా   జిల్లా అధ్యక్షుడు సునీల్ చౌదరి,  తెలంగాణ విమోచన కమిటీ జిల్లా కన్వీనర్ జనగామ విజయ్ కుమార్ ఓబీసీ  మోర్చా ప్రధాన కార్యదర్శి,  రాచకొండ రాజు,  గిరిజన మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గూగుల్లోత్ గోవిందు నాయక్,  బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి కోట రాజేశ్వర్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మహాకూటమి అభ్యర్థులను గెలిపించాలి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 18 : తెలంగాణా రాష్ట్రంలో ఉన్న సమస్యల పరిష్కారానికి రానున్న ఎన్నికలలో మహాకూటమి అభ్యర్థులను గెలిపించాలని తెలంగాణా వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి టి వెంకట్రాములు పిలుపునిచ్చారు. ఆదివారం రెబ్బెన మండలం గోలేటి లోని కే ఎల్ మహేంద్ర భవన్ లో రాయిలా నర్సయ్య అధ్యక్షతన జరిగిన  జిల్లావ్యావసాయ కార్మిక సంఘం సమావేశంలో ముఖ్య అతిధి గా పాల్గొని మాట్లాడారు. గత ఎన్నికలలో తెరాస ఇచ్చిన వాగ్దానాలైన దళితులకు 3 ఎకరాల భూమి, కే జి టూ పి  జి ఉచిత విద్య, లక్ష ఉద్యోగాలు, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు , కేవలం ప్రచారానికే పరిమితమయ్యాయని, ఏ  ఒక్క హామీని పూర్తి చేయలేదన్నారు. ప్రజలను మోసం చేసిన తెరాస నాయకులూ మల్లి మోసం చేయడానికి ఎన్నికల ప్రచారానికి వస్తున్నారని ప్రజలు పై విషయాలను గమనించి తగిన ఉద్ది చెప్పాలని అన్నారు. ముఖ్యంగా వ్యవసాయ కూలీలకు చేసింది ఏమిలేదని, వందల ఎకరాలు ఉన్నా బడా భూస్వాములకు ఎకరాకు 4 వేల  చొప్పున లక్షలాది రూపాయాలు ముట్టచెప్పారని అన్నారు. తెలంగాణా అభివృద్ధి కోసం, సామాజిక న్యాయం కోసం మహాకూటమిగా ఏర్పడిన కాంగ్రెస్, టి డి పి  , సి పి  ఐ అభ్యర్థులనే గెలిపించాలని కోరారు. డిసెంబర్  15, 16,  17 తేదీలలో ఢిల్లీ లో జరుగనున్న భారతీయ కిసాన్ మజ్దూర్ యూనియన్ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో  పూదరి ఐ, జాడి సాయి, మహేందర్, అర్జున్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. 

Saturday, 17 November 2018

తెరాస మహిళా టౌన్ అధ్యక్షురాలు రాజీనామా

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 17 : రెబ్బెన మండల తెరాస  టౌన్ మహిళా అధ్యక్షురాలు మన్యం పద్మ రాజీనామా చేశారు. రాజీనామాను జిల్లా తెరాస మహిళా అధ్యక్షురాలు  కుందారపు శంకరమ్మకు శుక్రవారం  అందచేశారు.   అనంతరం మాట్లాడుతూ రెబ్బెన  తెరాస  పార్టీ నాయకులూ తన ఎదుగుదలను చూసి ఓర్వలేక తన పై కక్షకట్టి అప్రతిష్ట పాలు చే స్తున్నందువల్ల తన పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. తెరాస పార్టీ కోసం అహోరాత్రాలు శ్రమించానని, దానికి గుర్తింపు లేకుండాపోయిందని వాపోయారు. ఈ విషయాలను గమనించి కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. 

తెరాసలో చేరిన యువత

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 17 : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలలో యువత చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. శనివారం  రెబ్బెన ఎంపీపీ కార్నాధం సంజీవ్ కుమార్  ఆధ్వర్యంలో రెబ్బెన మండలంలోని కొండపల్లి గ్రామానికి చెందిన  యువకులు   తెరాస లో చేరగా వారికి పార్టీ  కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సోమశేఖర్, గజ్జెల సత్యనారాయణ, సుదర్శన్ గౌడ్,భుజంగరావు, కస్తూరి మహేష్ ఉన్నారు

అత్యాచార దోషులను ఉరికంబం ఎక్కించాలి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 17 : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి  మండల కేంద్రంలో శ్రీరాముల సంధ్యపై అత్యాచారానికి పాల్పడి అతి కిరాతకంగా హత్యచేసిన దోషులను ఉరికంబం  ఎక్కించాలని రెబ్బెన మండల నాయీ సంఘం అధ్యక్షులు కళ్యాణం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం రెబ్బెన మండల కేంద్రంలో ని అతిధి గృహ ఆవరణలో జరిగిన నాయి బ్రాహ్మణా సంఘ సమావేశంలో మాట్లాడుతూ బాధిత కుటుంబానికి 20 లక్షల రూపాయలు, 2 ఎకరాల భూమి, కుటుంబంలో అర్హులైనవారికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కొత్తకొండ మల్లేష్, గైక్వాడ్ నాగరాజ్, కళ్యాణం తిరుపతి, పంజార్ల వెంకటేష్, కుదురుపాక సురేష్, ప్రభాకర్, పాల్గొన్నారు. ఈ నిరసనకు ఎం అర్  పి  ఎస్ మండల అధ్యక్షులు బొంగు నర్సింగ రావు, ఏ  ఐ వై ఎఫ్ జిల్లా అధ్యక్షులు గోగర్ల రాజేష్, మాల మహానాడు తరపున ఎర్ర మల్లేష్, విద్యార్థి విభాగం తరపున ధర్మా రావు తదితరులు మద్దతు తెలిపారు.

పోలీసులలో కూడా మానవీయ కోణం ఉంటుంది



కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 17 :  పోలీసులలో  కూడా మానవీయ కోణం ఉంటుందని  రెబ్బెన సి ఐ వి వి రమణ మూర్తి  అన్నారు.  పోలీసులు మీకోసం కార్యక్రమం లో భాగంగా   శనివారం రెబ్బెన మండలం లోని సోనాపూర్ కొలంగూడ గ్రామంలో  నిత్యవసర వస్తువులు, దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ   ప్రజలు ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనరాదని, నిషేదిత గుట్కాలు, గుడుంబా విక్రయించరాదని, మోటార్ సైకిల్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ తప్పని సరిగా ధరించాలని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపరాదన్నారు. రోడ్ ప్రమాదాల బారిన పడకుండా కాపాడుకోవాలని అన్నారు. ప్రజలు నిబంధనలను పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై దీకొండ రమేష్,   గ్రామ పటేల్ జంగు , గ్రామస్తులు పాల్గొన్నారు.

Friday, 16 November 2018

చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనరాదు ; సి ఐ రమణ మూర్తి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 16 : ప్రజలు ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనరాదని రెబ్బెన సర్కిల్   ఇన్సపెక్టర్  రమణ మూర్తి అన్నారు.  శుక్రవారం రెబ్బెన పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన  విలేకరుల సమావేశం లో మాట్లాదారు.  ప్రజలు ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనరాదని, నిషేదిత గుట్కాలు, గుడుంబా విక్రయించరాదని, మోటార్ సైకిల్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ తప్పని సరిగా ధరించాలని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపరాదన్నారు.  వర్షాల కారణంగా రోడ్ ల పై పడిన గుం తలను పోలీసులు మీకోసం భాగంగా పూడ్చడం జరిగిందన్నారు. ప్రమాద హెచ్చరిక బోర్డులు అమర్చడం జరిగిందని కావున వాహన చోదకులు జాగ్రత్తగా ఉండాలని, రోడ్ ప్రమాదాల బారిన పడకుండా కాపాడుకోవాలని అన్నారు. ప్రజలు నిబంధనలను పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై దీకొండ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి కార్మికులను ఓట్లు అడిగే నైతిక హక్కుతెరాస కు లేదు

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 16 : సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో కార్మికులకు ఇచ్చిన వాగ్ధానాలను అమలు పరచడంలో తెరాస శాసనసభ్యులు విఫలం చెందారని వారికి సింగరేణి కార్మికులను ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ కార్యదర్శి ఎస్.తిరుపతి అన్నారు. శుక్రవారం గోలేటిలోని కేఎల్ మహేంద్ర భవన్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతు గత సింగరేణి  ఎన్నికల సందర్బంగా గనులు, ఓసీపీలలో  ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా కేవలం మాటలతో మభ్యపెట్టారని అన్నారు. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలల దసరాకు ఓటెయ్యండి దీపావారికి కారుణ్య నియామకాలు అని,వడ్డీలేని  ఇంటి    రుణాలని , పెరుమార్పిడి వేగవంతం చేస్తామని కార్మికులను  మభ్యపెట్టి  పబ్బం గడుపుకున్నారని ఆరోపించారు. కార్మికులకు ఎలాంటి సమస్యవచ్చినా కేవలం ఫోన్ చేస్తే వస్తామన్న ఎం ఎల్ ఏ  లు కోవలక్ష్మి, దుర్గం చిన్నయ్య ఇంతవరకు ఎన్నిసార్లు వచ్చారని ప్రశ్నించారు. కల్లబొల్లి మాటలు చెప్పి అసెంబ్లీ ఎన్నికలలో ఓట్ల కోసం మళ్ళి  వస్తున్నారని, దీనిని కార్మికులు గమనించి తగిన బుద్ధి   చెప్పాలని అన్నారు. బెల్లంపల్లి , ఆసిఫాబాద్ ఎన్నికలలోమహాకూటమి అభ్యర్థులకు వోట్ వేసి తెరాస కు గుణపాఠం  చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కార్యదర్శి జగ్గయ్య, సి పి  ఐ మండలాకార్యదర్శి రాయిలా నర్సయ్య, వ్యవసాయ సంఘ కార్యదర్శి బానోతు కిషన్, ఫిట్ కార్యదర్శి జూపాక రాజేష్, ఏ  ఐ ఎస్ ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పూదరి సాయి కిరణ్, నాయకులు  నర్సయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు. 

Thursday, 15 November 2018

మావోల సమాచారం అందించి పోలీసులకు సహకరించాలి ; డిఎస్పీ సత్యనారాయణ

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 15 :  మావోయిస్టుల యాక్షన్ టీమ్ కు సంబంధించిన ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం  అందించి జిల్లాల్లో విధ్వంసాలు జరగకుండా ప్రజలు సహకరించాలని డి ఎస్పీ సత్యనారాయణ అన్నారు.  గురువారం రెబ్బెన పోలీస్ స్టేషన్లో సిఐ రమణమూర్తి, ఎస్సై దీకొండ రమేష్ లతో  కలిసి మావోయిస్టు యాక్షన్ టీం సభ్యులు పోస్టర్లను విడుదల చేశారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ  అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని విధ్వంసాలు సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు మావోయిస్టు యాక్షన్ టీం సంచరిస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. దాంతో పోలీసు శాఖ అప్రమత్తమై యాక్షన్ టీం సభ్యులతో కూడిన గోడపత్రులను అన్ని గ్రామాల్లో అంటిస్తున్నామన్నారు. గ్రామాల్లో యాక్షన్ టీమ్ సభ్యులకు సంబంధించిన ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సమాచారం అందించిన వారికి అయిదు లక్షల పారితోషకం అందజేస్తామన్నారు.  అలాగే సమాచారం తెలిపిన వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు గ్రామాల్లో ప్రజలు యాక్షన్ టీమ్ సభ్యుల పట్ల అప్రమత్తంగా ఉండి జిల్ల లోని విధ్వంసాలు జరగకుండా సహకరించాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంతంగా ముందు వాతావరణంలో జరిగేలా పోలీస్ శాఖ ప్రయత్నిస్తుందని దానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని ఆయన అన్నారు. మావోయిస్టును గుర్తించేందుకు యాక్షన్ టీమ్ సభ్యులతో గ్రామాల్లో పోస్టర్లు నటిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.

సమస్యలపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ కు వినతి పత్రం

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 15 : దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్   వినోద్ కుమార్ యాదవ్  గురువారం రెబ్బెన మండలంలోని లేతన్ గూడా రైల్వే గేట్   ను సందర్శించారు. ఈ సందర్భంగా 640 సోలార్ ప్లాంట్ ను ప్రారంభించారు. రెబ్బెన ఆసిఫాబాద్ రైల్వే స్టేషన్లో మౌలికవసతులు కల్పించాలని, ముఖ్యంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి ను నిర్మించాలని, స్టేషన్ లో తాగునీటి సౌకర్యం కల్పించాలని, ఎక్సప్రెస్  ట్రైన్లను ఆపాలని రెబ్బెన  జడ్పీటీసీ బాబు రావు, ఎంపీపీ కార్నాధం సంజీవ్ కుమార్,   నాయకులు బొమ్మినేని శ్రీధర్, కుందారపు శంకరమ్మ, జహూర్, చోటు, అప్పు, అన్నపూర్ణ అరుణ, నవీన్ జైస్వాల్, వినోద్ జైస్వాల్, మడ్డి శ్రీనివాస్ గౌడ్, భార్గవ్ గౌడ్, తదితరులు వినతి పత్రం అందచేసి మాట్లాడారు. నిజాం కాలం నటి నుండి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాన రైల్వే కేంద్రంగా ఉండి  నిత్యం వందలాది  మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్న  నూతనంగా ఏర్పడిన ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి రాష్ట్ర రాజధానితో కలిపే ఏకైక రైల్వే స్టేషన్   ను ప్రస్తుతం రైల్వే అధికారులు పట్టించుకోవాలని కోరారు. అనంతరం జీఎం  మాట్లాడుతూ సమస్యలపై అధ్యాయం చేసి సానుకూలంగా స్పందిస్తానని అన్నారు.  

Wednesday, 14 November 2018

విద్యార్థులకు నాణ్యత పరమైన భోజనాలు అందించాలి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 14 :   పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనాలు అందించాలని డిఇఓ కార్యాలయ సూపరిడెంట్ వినయ్ పాల్ సూచించారు. బుధవారం రెబ్బెన జడ్పీ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి తికమకగా పార్లర్లోనే మధ్యన భోజనాన్ని పరిశీలించారు వదలాలి రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం తరగతి తరగతిలోకి వెళ్లి విద్యార్థులు విద్యార్థుల్లో మాట్లాడారు పాఠశాల్లో కొనసాగుతున్న విద్యాబోధనపై విద్యార్థిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట HM స్వర్ణలత, ఉపాధ్యాయులు మేడి చరణ్ దాస్, ఎం డి.అనీస్, తుకారం,  శ్రీకాంత్, శబాన, శ్రీదేవి, సుదేవి,  శ్రీలత,  పార్వతి బానేశ్. తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడిగా గోగర్ల రాజేష్

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 14 : రెబ్బెన మండలముకు చెందిన గోగర్ల రాజేష్ ఎమ్మార్పీఎస్ రెబ్బెన మండలాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు పిట్టల సత్యనారాయణ ప్రకటించారు బుధవారం మండల కేంద్రంలోని నిర్వహించిన సమావేశంలో రెబ్బెన మండల కమిటీని ఎన్నుకున్నట్లు తెలిపారు. గౌరవ అధ్యక్షుడిగా అరికిల్ల రాజయ్య, అధికార ప్రతినిధిగా నగరపు భుజంగ రావు ఉపాధ్యక్షులుగా ఎగిరేప్పుడు రమేష్ వేములూరి మల్లేష్ పరిస్తితికి టక్కర్ పెళ్లైన కార్యదర్శిగా ఈదరకు రవీందర్ కార్యదర్శులుగా లక్ష్మీనారాయణ, వేములూరి మాలిక్, శంకర్, సహకాకార్యదర్శిగా శ్రీనివాస్, మల్లేష్ ప్రచార కార్యదర్శులుగా లింగంపల్లి రాకేష్, కోశాధికారిగా అరికిల్ల మూర్తి , సలహాదారులుగా వేమూనురి శంకర్, వడ్లూరి గణపతి, సభ్యులుగా పురుషత్వం, అరికిల్ల స్వామి, భీమరాజు లు ఎన్నుకున్నట్లు తెలిపారు.  ఈ సందర్భంగా అధ్యక్షుడుగా  ఎన్నికైన రాజేష్ మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తాననన్నారు. ఎస్సీ వర్గీకరణ సాధన కోసం పోరాటాలు చేపడతామని తనపై నమ్మకంతో మండల అధ్యక్షుడిగా బాధితులు అప్పగించినందుకు జిల్లా కమిటీకి కృతజతలు తెలిపారు. 

సత్ప్రవర్తనే గొప్ప లక్ష్యాల సాధనకు పునాది

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 14 : విద్యార్థుల సత్ప్రవర్తనే గొప్ప లక్ష్యాల సాధనకు   పునాది   అని  రెబ్బెన మండలం  ఎస్ ఐ  దీకొండ రమేష్ అన్నారు. జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని రెబ్బెన మండలం నక్కల గూడ ప్రాథమిక పాఠశాలలో  జవహర్ లాల్ నెహ్రూ జన్మదినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా మండలంలోని  పులికుంట, నంబాల, గంగాపూర్, పాసిగామ, రెబ్బెన  ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలలో నెహ్రు జయంతిని జరుపు కున్నారు. నక్కలగూడా పాఠశాలలో జరిగిన  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా   ఎస్ ఐ  దీకొండ రమేష్ పాల్గొని నెహ్రూ పటానికి పూలమాలలు వేసి అలంకరించారు.  అనంతరం  మాట్లాడుతూ చిన్నప్పుడు మంచి అలవాట్లు చేసుకుంటేనే పెద్దయ్యాక గొప్ప లక్ష్యాలను సాధించగలరని  చెప్పారు చదువుతోపాటు పెద్దల పట్ల వినయంగా ఉండడం కూడా నేర్చుకోవాలని చెప్పారు.  తాను కూడా ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత విద్య వరకు ప్రభుత్వ పాఠశాలలోనే  చదివాను అని చెప్పారు  విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు  తెలియజేసి స్వీట్లు పంచారు అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు  కల్వల   శంకర్  మాట్లాడుతూ  బాలలందరూ  శ్రద్ధగా చదువుకొని భవిష్యత్తులో మంచి పౌరులుగా రూపొందాలని కోరారు. బాలల దినోత్సవం సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన ఉపన్యాస పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు తదనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు దేవరకొండ రమేష్,  ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, రవి,  యస్.అనిల్ కుమార్, శైలజ, కవిత, గ్రామస్తులు మీసాల  పోష మల్లు.  రావుజి తదితరులు పాల్గొన్నారు.

Tuesday, 13 November 2018

ఎన్నికల హామీలు ఏం నెరవేర్చారని ముందస్తు ఎన్నికలు

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 13 : ప్రజలకు చేసిన  ఎన్నికల హామీలు ఏం నెరవేర్చారని ముందస్తు ఎన్నికలు  ఎవరి కోసం అని సిపిఐ మండల కార్యదర్శి  రాయల నర్సయ్య ప్రశ్నించారు. . మంగళవారం రెబ్బెన మండలంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలైన దళితుని ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాల భూమి, నీరుడుయోగులకు లక్ష ఉద్యోగాలు  ఇంటింటికి నల్ల నీరు, వంటి వాటిని పూర్తిగా మరచి, గొర్రెలు , బర్రెలు  అంటూ  ప్రజలను మాయ మాటలతో మభ్య పెడుతూ,ప్రజలిచ్చిన 5 సంవత్సరాల పాలన సమయాన్ని పాలన చేతగాక 4 ఏళ్లకే చతికిలపడి, కేవలం తన 4 గురు కుటుంబ సభ్యులకు మాత్రం పదవులిచ్చి నిరుద్యోగులను మోసం చేశారని అన్నారు. తెరాస ప్రభుత్వం ప్రజావ్యతిరేక సిద్ధాంతాలను ఇక ఏమాత్రం సహించకుడన్న ధేయంతో మహాకూటమి ఏర్పాటు చేశామని ప్రజలు పై విషయాలను గమనంలో ఉంచుకొని రాబోయే ఎన్నికలలో మహాకూటమి అభ్యర్థులను ఆదరించి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో సి పి  ఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు రామడుగు శంకర్, జిల్లా రైతు సంఘం అధ్యక్షులు కుందారపు బాసవయ్య, జిల్లా కార్యదర్శి జాడి గణేష్, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి అనుముల రమేష్, ఏఐటీయూసీ రెబ్బెన మండల అధ్యక్షులు రాచకొండ రమేష్, ఉపాధ్యక్షులు గోగర్ల శంకర్, తదితరులు ఉన్నారు.

బాలల దినోత్సవం సందర్భంగా ఆటల పోటీలు


 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 13 : బాలల దినోత్సవం సందర్భంగా గోలేటి ఈ సిఇఆర్ క్లబ్ లో మంగళవారం డ్రాయింగ్ పెయింటింగ్ ఫ్యాన్సీ డ్రెస్ గ్రూప్ డ్యాన్స్లు పోటీలు నిర్వహించడం జరిగిందని ఏరియా డీజీఎం పర్సనల్ జె కిరణ్ తెలిపారు.  గోలేటి  సింగరేణి పాఠశాల,  ఎస్టీ ఆగ్నెస్,   తాండూర్ విద్యాభారతి స్కూలు,  రెబ్బెన జిల్లాపరిషత్  స్కూల్ , నంబాల జిల్లాపరిషత్  స్కూల్ నుండి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు  బాలల  దినోత్సవం నాడు సింగరేణి పాఠశాలలో ఉదయం పదకొండు గంటలకు జరిగే కార్యక్రమంలో జిఎం చేతుల మీదుగా అందజేస్తామని అన్నారు.

బాలల హక్కుల పై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 13 : బాలల హక్కుల  పై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని రెబ్బెన మండల  అదనపు   డిపిఓ కిరణ్మయి అన్నారు మంగళవారం రెబ్బెన మండల కేంద్రంలోని జిల్లా పరిషత్  పాఠశాలలో  బాలల హక్కుల  దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల ఏడు నుంచి పధ్నాలుగు వరకు బాలల హక్కుల దినోత్సవాన్నినిర్వహించనున్నట్లు తెలిపారు.    బాలల  హక్కులపై  కనీస అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేపడుతున్నామని పదిహేను సంవత్సరాల లోపు పిల్లలు అందరూ తప్పనిసరిగా పాఠశాలలకు హాజరుకావాలన్నారు.  అంతకాకుండా బాల్య వివాహాలు  చేసుకోరాదని అన్నారు.   తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితులలో   చిన్న పిల్లలను పనుల్లో పెట్టరాదు ఎవరైనా బాలల చట్టాలను ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడైనా  చట్టాల ఉల్లంఘన జరిగితే  సమాచారం ఇవ్వాలన్నారు .  విద్యార్థులకు వ్యాసరచన మ్యూజికల్ పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్ వైజర్  చిట్టెమ్మ,  కవిత,  పాఠశాల ఉపాధ్యాయులతో పాటు అంగన్వాడి టీచర్లు బాలమ్మ చంద్రకళ సాంబలక్ష్మి తిరుమలమ్మ భూదేవి రాధా తితరులు పాల్గొన్నారు. 

ఎయిడ్స్ నియంత్ర పై అవగాహన సదస్సు

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 13 :  యువత ఎయిడ్స్ పై అవగాహన పెంచుకొని ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని జిల్లా ఆరోగ్యవిభాగం ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ కే సీతారాం అన్నారు. మంగళవారం రెబ్బెన మండల ప్రభుత్వ  జూనియర్ కళాశాలలో రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, ఎన్ ఎస్ ఎస్ మరియు ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ కే శంకర్ అధ్యక్షతన  జరిగిన ఎయిడ్స్ అవగాహనా సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  ఎయిడ్స్ ఓ ప్రమాదకరమైన అంట వ్యాధి అని  దీని బారిన పడకుండా యువత ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవాలని అన్నారు. ఎయిడ్స్, హెచ్ ఐ వి పై నిర్వహించిన ఉపన్యాస, వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందచేశారు.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కో ఆర్డినేటర్ రమేష్, జాతీయ సేవా పథకం అధికారులు ప్రకాష్,సీనియర్ అధ్యాపకులు సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

గ్రామ పంచాయతీ కార్మికులకు జీతాలు చెల్లించని పంచాయతీ కార్యదర్శి

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 13 :  గత ఎనిమిది నెలల నుంచి గ్రామ పంచాయతీ కార్మికులకు గ్రామ పంచాయితీ కార్యదర్శి  వేతనాలు చెల్లించడంలేదని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి  బోగే ఉపేందర్ ఆరోపించారు. మంగళవారం రెబ్బెన ఎంపీడీఓ కు ఈ విషయం పై వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. పంచాయతీ కార్మికులకు 8 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని, రేపు, మాపు అంటూ కాలయాపన చేస్తున్నారని అన్నారు.  కార్మికులు, కుటుంబ సభ్యులు పస్తులుండవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కావున ఎంపీడీఓ ఈ విషయం పై కలుగ చేసుకొని జీతాలను త్వరగా చెల్లించేలా ఆదేశాలు జారీ  చేయాలని కోరారు. కానీ పక్షంలో  ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామా పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు రాచకొండ రమేష్, ఉపాధ్యక్షులు లాల్ సింగ్, గోగర్ల శంకర్, ఎల్లల పోశం,   కార్యదర్శి దుర్గం వెంకటష్, తదితరులు పాల్గొన్నారు.

Monday, 12 November 2018

ఈ నెల 19 న మధ్యాహ్న్న భోజన పథకం కార్మికుల చలో పార్లమెంట్

   కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 12 : దేశవ్యాప్తంగా మధ్యాహ్న్న భోజన పథకం కార్మికుల చలో పార్లమెంట్ పిలుపునకు సన్నద్ధంగా సోమవారం రెబ్బెన మండల కేంద్రంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధానకార్యదర్శి బి ఉపేందర్  కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న 26 లక్షల మధ్యాహ్నా భోజన కార్మికులు చాలీ చాలని వేతనాలతోఎన్నో ఇబ్బందులు పడుతున్నారని  వారి సమస్యల పరిష్కారంకోసం కేంద్ర కార్మిక సంఘం చలో ఢిల్లీ పిలుపునిచ్చిందన్నారు. . డిమాండ్లలో ముఖ్యమైనవి వారిని నాలుగవ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం 18 వేలు ఇవ్వాలని, పి  ఎఫ్ , ఈ ఎస్ ఐ సౌకర్యం కల్పించాలని తదితర డిమాండ్లతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. కావున మండలంలోని కార్మికులు అధిక సంఖ్యలో  పాల్గొని  విజయవంతం చేయాలని కొరారు. ఈ కార్యక్రమంలో  విజయ, లక్ష్మి, పార్వతి, శాంకరి, లాల్ తదితరులు    పాల్గొన్నారు.

సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో 14 న బాలల దినోత్సవం

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 12 :  సింగరేణి సంస్థ కమ్యూనికేషన్ సెల్ ఆధ్వర్యంలో ప్రీతి ఏటా నవంబర్ 14 న బాలల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నదిని , ఈ సందర్భంగా బాల బాలికలలో ప్రతిభా పాటవాలను, మరియు పోటీతత్వాన్ని పెంపొందించుటకై వివిధ విభాగాలలో పోటీలు నిర్వహించనున్నామని డిజిఎం  పర్సనల్ జ్ కిరణ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డ్రాయింగ్, పెయింటింగ్, గ్రూప్ ఫోక్ డాన్స్, ఫాన్సీ డ్రెస్ కంపిటిషన్ తదితర విభాగాలలో సీనియర్, మరియు జూనియర్ గ్రూప్ లకు పోటీలు నిర్వహిస్తున్నామన్నారు.  ఈ పోటీలు 13 వ తేదీన గోలేటిలోని సి ఈ ఆర్ క్లబ్ నందు జరుగునని తెలిపారు. కావున బాల బాలికలు ఈ పోటీలలో పాల్గొనాలని కోరారు.

సింగరేణి సంస్థ రక్షణా వారోత్సవాలు

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 12 :  బెల్లంపల్లి ఏరియా సింగరేణి సంస్థ  గోలేటి లో ఈ నెల 12వ తేదినుండి 18 వ తేదీవరకు రక్షణా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఏరియా జీఎం  జ్ కిరణ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా రక్షణపై అవగాహన కల్పించడానికి గోలేటి ఆఫీసర్స్ క్లూబ్లో, గోలేటి సి ఈ ఆర్ క్లూబ్లలో మహిళలకు వక్తృత్వ పోటీలను 16 న నిర్వహిస్తున్నామన్నారు. కావున ఆసక్తి గల మహిళలు ఈ పోటీలలో పాల్గొనాలని కోరారు. 

16 న ఎం ఆర్ పి ఎస్ మండల స్థాయి సమావేశం

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 12 :  ఈ నెల 16 న ఎం ఆర్ పి  ఎస్ మండల స్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు   జిల్లా అధ్యక్షులు పిట్టల సత్యనారాయణ మాదిగ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో మండల కార్యవర్గ కమిటీని ఎన్నుకోనున్నట్లు తెలిపారు. కావున మండలంలోని అన్ని గ్రామల అనుబంధ సంస్థల నాయకులూ అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.

రైలు కిందపడి వృద్ధుడు ఆత్మాహత్య



 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 12 :  ఆసిఫాబాద్ రోడ్ రేపల్ల్వాడు రైల్వే స్టేషన్ల మధ్యలోని తక్కలపల్లి గేట్ సమీపంలో సోమవారం గుర్తు తెలియని రైలు కింద పడి తక్కలపల్లి గ్రామానికి చెందిన నాయికిని చంద్రయ్య (70) ఆత్మాహత్యకు పాల్పడ్డట్లు జిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సత్తయ్య తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం చంద్రయ్య భార్య గత ముప్పై సంవత్సరాల క్రితమే మృతి చెందగా పిల్లలు పెళ్ళిళ్ళు పూర్తిచేసి ఒంటరిగానే జీవిస్తున్నాడు క్రమేపీ వయసుపై పడటంతో పాటు ఆరోగ్యం క్షీణించి మద్యానికి బానిసై  ఆరోగ్యం అస్సలు   సహకరించక పోవడంతో కుటుంబ సభ్యులు వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్న చంద్రయ్య నిరాకరిస్తూ వచ్చాడు. ఆరోగ్యం క్షీణించడంతో ఎవరికీ భారం కావద్దనే ఉద్దేశ్యంతో జీవితంపై విరక్తి చెందిన ఆయన ఆదివారం ఇంటి నుండి బయలుదేరాడు సోమవారం తెల్లవారుజామున తక్కలపల్లి గేట్ సమీపంలో ట్రాక్ వెంట నడుచుకుంటూ వెళ్తూ ఆఫ్లైన్ పై వస్తున్న గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  కాగా మృతుడికి నలుగురు కుమారులు ఒక కుమార్తె లు ఉన్నారు జీఆర్పీ ఎస్సై జితేందర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

Sunday, 11 November 2018

మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 11 :  మౌలానా అబ్దుల్ కలాం   ఆజాద్ జయంతి వేడుకలను ఆదివారం రెబ్బెన మండల కేంద్రంలోని రెబ్బెన ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో  ఘనంగా నిర్వహించారు.  ప్రిన్సిపాల్ జాకిర్ ఉస్మాని అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళు లర్పించారు. అనంతరం మాట్లాడుతూ జాతీయోద్యమంలో మహాత్మా గాంధీతో కలసి పనిచేశారని, స్వతంత్ర భారతావనిలో తోలి విద్యా శాఖా  మంత్రిగా పనిచేసారన్నారు. వలసవాద  అవసరాలకు రూపొందించిన విద్యావ్యవస్థను ప్రక్షాళన చేసి దేశీయ అవసరాలకు అనువైన విద్య సంస్కరణలను తీసుకొచ్చి అమ లు చేశారన్నారు. అందరికి సమానమైన అవకాశాలతో విద్యను అందించడానికి క్రషిచేశారన్నారు. స్వల్ప కాలం లోనే దేశంలో విద్యా రంగాన్ని మంచి స్థితికి తీసుకు వచ్చిన మహానేత అని కొనిపోయాడారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మల్లేష్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు. 

Saturday, 10 November 2018

డిగ్రీ సెమిస్టరు పరీక్షలు ఈ నెల 24 నుండి ప్రారంభం

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 10 :  కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 1,3,5వ సెమిస్టరు పరీక్షలు ఈ నెల 24నుండి ప్రారంభమౌతాయని కాకతీయ యూనివర్సిటీ కంట్రోలర్ అఫ్ ఎక్సమినేషన్స్ మహేందర్ రెడ్డి  ఉత్తర్వులు జారీ చేసినట్లు రెబ్బెన ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ జాకిర్ ఉస్మాని శనివారం  ఒక ప్రకటనలో తెలిపారు. సమయం తక్కువగా ఉన్నందున విద్యార్థులు గమనించి పరీక్షలకు సిద్ధం కావాలని కోరారు. 1, 3 వ సెమిస్టరు పరీక్షలు మధ్యాహ్నం  2 నుండి 5 వరకు, 5 వ సెమిస్టరు ప్రొద్దున్న 9 నుండి 12 వరకు ఉంటుందని తెలిపారు. 

Friday, 9 November 2018

రెబ్బెన లో ఎమ్మెల్సీ పురాణం జన్మదిన వేడుకలు


 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  రెబ్బెన, నవంబర్ 9 : రెబ్బెనలో శుక్రవారం ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. తెరాస జిల్లా ఉపాధ్యక్షులు నవీన్ జైస్వాల్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.  టీఆర్ఎస్ మండలాధ్యక్షులు పోటు శ్రీధర్ రెడ్డి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి పెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి ఎంతో కృషి చేసన కోసం పురాణం సతీష్ కుమార్   భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులను చేరుకోవలన్నారు.   ప్రజా సంక్షేమంతో పాటు టీఆరెస్ పార్టీ బలోపేతానికి పాటుపడుతున్నారని అన్నారు.  ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంజీవ్కుమార్ జడ్పీటీసీ బాబురావు  బొమ్మినేని శ్రీధర్ కుమార్ దుర్గం భరద్వాజ్,  పెసరు మదునయ్య  తదితరులు పాల్గొన్నారు.