Wednesday, 31 May 2017

రేషన్ డీలర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి ; ఏఐటీయూసీ నాయకులు

రేషన్ డీలర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి  ; ఏఐటీయూసీ నాయకులు  

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 30 ; (వుదయం ప్రతినిధి) ; రేషన్ డీలర్లకు  ఉద్యోగ భద్రత కల్పించాలని  ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు  బోగే ఉపేందర్ మరియు మండల  అధ్యక్షులు రాయిల్లా నర్సయ్యలు బుధవారం తహసీల్దారు కార్యాలయం ముందు బైఠాయించి సీనియర్ అసిస్టెంటుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 40 ఎళ్లగా రేషన్ డీలర్లు నిత్యావసరవస్తువులు పంపిణి చేస్తున్న చాలీచాలని కమిషన్లతో జీవనం సాగించడం కష్టతరం అవుతుంది అని అన్నారు. కనీసవేతనం 25000వేలు రూపాయలు ఇతర రాష్ట్రలలో  చెల్లింస్తున్న విధంగా అమలుపరచాలని  డిమాండ్ చేసారు. అలాగే  రేషన్ షాపులో  14 రకాల నిత్యావసరవస్తువులు పంపిణీచేస్తు రేషన్ వవస్థను కొనసాగించాలని అన్నారు. హమాలీ కార్మికులకు పని భద్రతను కలిపిస్తూ 50ఏళ్ళు పై బడినవాళ్లకి 3000రూపాయల పింఛన్ కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు కిషన్ సింగ్ రాజమణి తీరుపతి విజయ రాజయ్య జానకిరాంలు పాల్గొన్నారు.

అంకిత భావం తో విధులు నిర్వర్తిస్తేనే గుర్తింపు - ఎస్పి సన్ ప్రీత్ సింగ్

 అంకిత భావం తో విధులు నిర్వర్తిస్తేనే  గుర్తింపు  - ఎస్పి సన్ ప్రీత్ సింగ్

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 30 ; (వుదయం ప్రతినిధి) ; విధి  నిర్వహణలో  అంకితబావం తో పని చేస్తేనే గుర్తింపు ఉంటుందని జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ తెలిపారు ,సిబ్బంది ప్రజా సేవ యే పరమావధి గా చేసినవారి  సేవలను అమోఘమని అయన అబినందిచారు.బుధవారం జిల్లా లోని స్థానిక జిల్లా ప్రధాన పోలీసు కార్యాలయం లొ పదవి విరమణ పొందిన SD.మోగ్దము హెడ్ కానిస్టేబుల్ ఏ ఆర్  హెడ్ క్వార్టర్స్,  T.కిషన్ ఏ.ఎసై కాగజ్ నగర్ టౌన్  లను  జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ గారు శాలువ తో సత్కరించి పుష్ప గుచ్ఛము ను అందచేసీ  వారి సేవలను కొనియాడారు , వారి యొక్క శేషజీవితము సుఖ సంతోషాలతో మనుమలు,మనుమరాండ్ల తో  ఆనందం తో గడపాలని అబిలాశించారు  మరియు  వారికీ రావలిసిన బెనిఫిట్స్ ను తక్షణం అందిస్తామని ఈ సందర్బంగా  జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ కార్యక్రంలో  ,ఎస్బి సీ ఐ వెంకటేశ్వరులు ,ఎస్బి ఎసై లు శివకుమార్ ,శ్యాం సుందర్, ఎస్పిసీసీ శ్రినివాస్, హెడ్ క్వార్టర్ ఆర్ ఐ  వామనమూర్తి ,ఆర్ ఎసై యం.శ్రినివాస్ మరియు  పి.ఆర్.ఓ మనోహర్ లు పాల్గొన్నారు.

Monday, 29 May 2017

ప్రజల బాగస్వామ్యం తో నే శాంతి భద్రతలు సాద్యం - జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్

 ప్రజల బాగస్వామ్యం  తో నే శాంతి భద్రతలు  సాద్యం - జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 29 ; (వుదయం ప్రతినిధి) ;    జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన పోలీసు కార్యాలయము లో జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ గారు  సోమవారం నాడు ప్రజా ఫిర్యాదు ల కార్యక్రమం ను నిర్వహించారు ,ప్రజా ఫిర్యాదుకార్యక్రమంకు వచ్చిన వారి నుంచి ఫిర్యాదులను నేరుగా స్వీకరించారు .ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ జిల్లా పోలీసులు శాంతి భద్రతల తో పాటు గా  జిల్లా లోని మారుమూల ప్రాంతాల లోని ప్రజలతో మమేకం అయి వారికీ , నేరాలు మోసాలు పట్ల అవగాహన కలిపిస్తూ వారిని చైతన్య వంతులను చేసే ల కార్యక్రమాలను చేపడుతున్నామని,జిల్లా లోఫ్రెండ్లీ పోలీస్ నెలకొని వుందని ఈ స్నేహ పూరిత వాతావరణం ను ఇలాగే కొనసాగిస్తామని  ఇక పై సమస్యల పైన వారి బాగాస్వామ్యం తో ముందుకు వెళ్లి వారికీ న్యాయం  చేకురేలా ప్రయత్నిస్తామని తెలిపారు.అంతేకాక  కేసు పురోగతి లో వేగం పెంచేలా జిల్లా లోని మొత్తం పోలీసు స్టేషన్ లను cctns కింద అనుసందానము చేసి ఆదునికత ను అంది పుచ్చుకున్నాం అని ,దిని వల్లకేసు పురోగతి ,మరియు పారదర్శకత రెండు పెరిగి సత్వర న్యాయం బాధితుడికి అందుతుందని తెలిపారు. సోమవారం ప్రజా ఫిర్యాదుల విబాగం లో ఎక్కువ కేసు లు భూసమస్యలపై రావటం జరిగింది ఫిర్యాదు దారులు తమ యొక్క సమస్యను జిల్లా ఎస్పి గారికి తెలుపగా ,సమస్యల పైన స్పందించిన జిల్లా ఎస్పి గారు ఆయా స్థానిక పోలీసు అధికారుల తో ఫోన్ లొ మాట్లాడి వారికీ  న్యాయం జరిగేల హామీ ఇచ్చారు. ఈ కార్యక్రంలో ఎస్బిసీ ఐ వెంకటేశ్వరులు, ఎసై లు శివకుమార్, శ్యాం సుందర్ ఎస్పిసీసీ శ్రినివాస్, పి.ఆర్.ఓ మనోహర్ లు ఫిర్యాదుల విబాగం అధికారిని సునీత లు  పాల్గొన్నారు.

Sunday, 28 May 2017

ప్రజల అబివృధే ప్రధాన ఎజండా ; రితేష్ రాతాడ్, తెలుగుదేశం నుంచి రాజీనామా

ప్రజల అబివృధే ప్రధాన ఎజండా ; రితేష్ రాతాడ్
తెలుగుదేశం నుంచి  రాజీనామా 
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 28 ; (వుదయం ప్రతినిధి) ;  ప్రజల అబివృధే ప్రధాన ఎజండాగా నిర్ధారించుకొని తెలుగుదేశం పార్టీ నుండి నాయకులు, కార్యకర్తలు  రాజీనామా చేసామని రితేష్ రాతాడ్ అన్నారు. ఆదివారం ముందుగా ఎన్టీర్ విగ్రహానికి పూలమాలలువేసి నివాలులు అర్పించారు.  రెబ్బన అతిధి ఆవరణలో  ఏర్పాటు చేసిన కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ నుంచి నాయకులు    పార్టీ నుంచి రాజీనామాలు చేపడుతున్నట్లు తెలిపారు  అనంతరం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి రితేష్ రాతాడ్ మాట్లాడుతూ ప్రజల అబివృధే ప్రధాన ఎజండాగా నిర్ధారించుకొని తెలుగుదేశం పార్టీ నుండి నాయకులు, కార్యకర్తలు  రాజీనామా చేసామని అన్నారు.తెరాసలో చేరనునట్లు తెలిపారు.

గిరిజన ప్రాంతంల్లో కొమురంభీం జిల్లా పోలీసులు ప్రజా అవగాహనా సదస్సులు

గిరిజన ప్రాంతంల్లో కొమురంభీం జిల్లా పోలీసులు  ప్రజా అవగాహనా సదస్సులు 
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 28 ; (వుదయం ప్రతినిధి) ;   ప్రజలకోసమే పోలీసులు అంటూ కొమురం బీమ్ జిల్లా పోలీసులు ప్రతి గ్రామాలలో ఫ్రెండ్లి పోలీస్ మరియు పోలీస్ గ్రామసభలు ఏర్పాటు చేస్తూ ప్రజలను చైతన్య పరచటంలో ముందుంటున్నారు. ఆదివారం నాడు  సిర్పూరు యు మండలంలోని  కొద్దిగూడ గ్రామంలో సిర్పూరు ,(యు)  ఎస్.ఐ  రామారావు గ్రామ ప్రజలకు జీవన శైలిపై  అవగాహనా కల్పించారు.    నకిలీ విత్తనాలు పట్ల రైతులు  జాగ్రత్తలు పాటిస్తూ  నాణ్యత  లేని  విత్తనాల ను నాటి నష్టాల పాలు కావద్దని సూచించారు. ఇలా  మోసపూరిత విత్తనాలను అమ్ముతున్నా దళారుల గురించి సమాచారమందించాలని కోరారు. కొమురంభీం జిల్లా ఎస్ పి సన్ప్రీత్ సింగ్ ఆదేశాలమేరకు గ్రామప్రజలకు అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ గ్రామ సభలో  గిరిజన రైతులను పోలీసు సిబ్బంది  గ్రామాప్రజలు పాల్గొనరు.

Saturday, 27 May 2017

మతసామరస్యం,సోదరభావతోనే శాంతి సాధ్యం - ఎస్పి -సన్ ప్రీత్ సింగ్ ఐ.పి.స్

మతసామరస్యం,సోదరభావతోనే శాంతి సాధ్యం - ఎస్పి -సన్ ప్రీత్ సింగ్  ఐ.పి.స్ 

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 27 ; (వుదయం ప్రతినిధి) ;  దేశంలో అనేక కులాలు ,మతాలు ,వర్గాలు వున్నాయి అని ఏ వర్గం వారు,అ వర్గం కు సంబంధించిన  పండుగలను జరుపుకునేపుడు అన్ని  వర్గాలవారు మత సామరస్యం పాటించాలని జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ గారు తెలిపారు ,శనివారం కాగజ్ నగర్ లోని స్థానిక సంతోష్ ఫంక్షన్ హల్ లో జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ గారి అధ్యక్షతన శాంతి కమిటీ సమావేశం జరిగింది ,ఈ సందర్బముగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా లొని ముస్లిం సోదరి, సోదరులందరు ,రంజాన్ మాసం ను, రంజాన్ ను భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని, ముస్లింలకు రంజాన్ పండుగ విశిష్టమైనది పేర్కొన్నారు. జిల్లా లో రంజాన్ మాసము సందర్బంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా, అన్ని శాఖల సహకారం తీసుకుంటామని తెలిపారు. అంతేకాక శాంతి భద్రతల అదుపులో ప్రజల యొక్క బాగస్వామ్యం ఎంతో ముఖ్యము అని ,వారి సహకారం తోనే శాంతియుత వాతావరణం సాధ్యము అని ,ఎక్కడయితే అందరు సోదరభావం కలిసి మెలిసి వుంటారో అక్కడ అబివృద్ది జరిగి అందరు సంతోషంగా ఉంటారని తెలిపారు. కుమరంభీమ్ జిల్లా శాంతి యుతమైన జిల్లా అని ,ఇలాంటి మంచి పేరు ను మనం కాపాడుకోవడానికి కృషి చెయ్యాల్సిన అవసరం ఎంతైనా వున్నదని ఈ పవిత్ర మాసం లో ఎలాంటి ఆసాంఘిక ,అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలిసులకు సహకరించాలని కోరారు ,జిల్లా లో నేరాల అదుపునకు పోలీసు యంత్రంగము అంతా కష్టపడి మీకోసమే పనిచేస్తుందని, "ఫ్రెండ్లీ పొలీసింగ్ "లో బాగంగా పోలీసులు ప్రజలతో మమేకం అయి వారిలో భయం ను పోగొట్టి భరోసా కల్పిస్తున్నారన్నారు దీనితో ప్రజలు పోలీసులను తమ సన్నిహిత మిత్రులలా భావిస్తున్నారని ఆయన అభివర్ణించారు. ఈ శాంతి సమావేశం లో కాగజ్ నగర్ డిఎస్పి హబీబ్ ఖాన్ ,కాగజ్ నగర్ (T)సి ఐ నాగేందర్ ,కాగజ్ నగర్ (R)సి ఐ రమేష్ ,రెబ్బెన సి ఐ మదన్ లాల్ ,కాగజ్ నగర్ టౌన్ ఎసై రాజెశ్ ,మున్సిపల్  చైర్మన్  విద్యాదేవి ,MRO రామ్మోహన్ రావు  ,కౌన్సిలర్ సద్దాంహుస్సేన్ ,పీస్ కమిటీ సభ్యులు ,మాజీ మున్సిపల్ చైర్మన్ మఖ్బుల్ హుస్సేన్, ఫ్యామిలి కౌన్సెలింగ్ మెంబర్  మొహమ్మద్ వాహబ్ మరియు ఎస్పీ పి.ఆర్.ఓ మనోహర్, ఇతరులు పాల్గొన్నారు.

అంకితబావంతో పని చేస్తేనే సమాజంలొ గుర్తింపు- ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐ.పి.స్

అంకితబావంతో పని చేస్తేనే సమాజంలొ గుర్తింపు- ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐ.పి.స్

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 27 ; (వుదయం ప్రతినిధి) ;   పోలీసులు విది నిర్వహణలో అంకిత బావం , సేవా తత్పరతలతో శాంతి భద్రతలను పరిరక్షించాలని ,జిల్లా పోలీసులు అన్నిటా ఆదర్శంగా, మార్గనిర్దేశకులుగా నిలవాలని అందుకు జిల్లా అధికారుల నుంచి ఎల్ల   వేళల సహాయ సహకారాలు అందిస్తాము అని కుమరం భీమ్ జిల్లా  ఎస్పి సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. శనివారం`  ఆసిఫాబాద్ జిల్లాలొ ఎఆర్ ఎసై గా పనిచెస్తూ ఆర్ఎస్సై గా ప్రమోషన్ పొందిన నజార్ హుస్సేన్ ను  జిల్లా ఎస్పి గౌరవచిహ్నం,  పదోన్నతి  చిహ్నం ను అలంకరించి శాలువ తో సత్కరించి అబినందిచారు.ఇక పైన కూడా రెట్టింపు ఆత్మ విశ్వాసం తో శాంతి భద్రతలను కాపాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్  సీ ఐ వెంకటేశ్వరులు, స్పెషల్ బ్రాంచ్  ఎసై లు శివకుమార్, శ్యాం సుందర్ ఎస్పిసీసీ శ్రినివాస్,హెడ్ క్వార్టర్ ఇన్చార్జి ఆర్ఐ వామన మూర్తి, పి.ఆర్.ఓ మనొహర్ లు పాల్గొన్నారు. 

రైతుసర్వేను పర్యవేక్షించిన వ్యవసాయ జిల్లా అధికారి


రైతుసర్వేను పర్యవేక్షించిన వ్యవసాయ జిల్లా అధికారి 

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 27 ; (వుదయం ప్రతినిధి) ; రెబ్బెన మండలంకొని వాంకులం గ్రామంలో శనివారం మండలవ్యవసాయ అధికారులు సమగ్ర రైతు సర్వే నిర్వహిస్తుండగా జిల్లా వ్యవసాయాధికారి  అభిమన్యుడు సర్వే జరుగుతున్నతీరును పరిశీలించారు. రైతులవివరాలను ఏవిధమైన పొరపాట్లులేకుండా సమగ్రమైన సర్వే చేయాలనీ  అధికారులకు సూచించారు . రైతులుకూడా సరియైన  అధికారులకుఅందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీటీమ్  గురుమూర్తి ,మండల వ్యవసాయ అధికారిణి  మంజుల,సహాయక వ్యవసాయ అధికారులు మార్క్,అర్చన తదితరులు  పాల్గొన్నారు. 

తెలంగాణ 3వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోనున్న సింగరేణి

తెలంగాణ 3వ  ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోనున్న సింగరేణి 

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 27 ; (వుదయం ప్రతినిధి) ; తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని సింగరేణి యాజమాన్యం  ఘనంగా జరుపనుందాని డిజిఎం జె చిత్తరంజన్ కుమార్ శనివారం ఒక ప్రకటన ధ్వారా తెలిపారు.  బెల్లంపల్లి సింగరేణి ఏరియా రెబ్బెన మండలంలోని గోలేటిలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను పండుగ వాతావరణం మధ్య ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆవిర్భావ దినోత్సవం రోజున ఉదయం 7:30 గంటలకు జి ఎం  కార్యాలయం నుండి తెలంగాణ రన్ కార్యక్రమం ఉంటుందన్నారు. అలాగే బెల్లంపల్లి ,మాదారం, గోలేటిలలో మహిళలకు ప్రత్యేకంగా ఆటలాపోటీలు మరియు దీపాలంకరణ పోటీల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సింగరేణి పాఠశాల  ప్రాంగణంలో సాయంత్రం 6 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. సింగరేణికి  సంబందించిన స్టాల్స్ తో పాటు తెలంగాణ వంటకాల స్టాల్ లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు ఆవిర్భావ దినోత్సవంలో పాలుపంచుకొని  పండుగ వేడుకలను విజయవంతం చేయాలనీ కోరారు.

Friday, 26 May 2017

తెలుగు దేశం పార్టికి పలువురు రాజీనామా

 తెలుగు దేశం పార్టికి పలువురు  రాజీనామా

కోమరంభీం ఆసిఫాబాద్ జిల్లా: తెలుగు దేశం పార్టి జిల్లా అధ్యక్షుడు. కెరమెరి.ZPTCఅబ్దుల్ కలామ్. 9మంది సర్వంచ్ లు.3Mptcలు.500మంది కార్యకర్తలు శుక్రవారం TDP పార్టీ కీ రాజీనామా చేశారు ఈనెల29న ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలోTRS పార్టీ లో చేరనున్నట్లు వినికిడి.......

ఆన్లైన్ మోసాలపై గిరిజనులకు అవగాహన

ఆన్లైన్ మోసాలపై గిరిజనులకు అవగాహన
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 26 ; (వుదయం ప్రతినిధి) ;  యూవత చదువు ఫై ఆసక్తి పెంచుకుంటూ డిజిటల్ ఇండియా లో భాగస్వాములు అవుతూ ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాలను గమనిస్తూ  నిరక్షరాసులను అవగాహన కల్పిస్తూ ఉండాలని  జైనుర్  సీఐ . రవి కుమార్ అన్నారు.  శుక్రవారం సిర్పూర్ యు మండలం లోని  మహాగమ్  గ్రామం లో ఆన్లైన్ మోసాలపై గిరిజనులకు అవగాహన కల్పించారు. అలాగే అటవీ హక్కుల చట్టాలను ఏ విదంగా వినియోగించు కోవలో గిరిజనులకు వివరించారు. ముఖ్యంగ యూవత చెడు  వ్యసనాలకు బానిసలూ కాకుడదని  సన్మార్గంలో నడుచుకుంటూ చదువు ఫై ఆసక్తి  చూపిస్తూ ఉన్నత శ్రేణులకు చేరాలని సూచించారు. యూవత పెద్దలకు  నిరక్షరాసులకు చదువు చెప్పి వారికీ ఆన్లైన్ మోసాలు మరియూ బ్యాంకింగ్ గురించి తెలియ చేయాలనీ అన్నారు.  సమాజం లో జీవించడానికి చదువు ఎంతో ముఖ్యం అని అందుచే ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాత్రి బడులు సాక్షర భారత్ ఇలాంటి వసతులు వినియోగించు కొనేలా నిరక్షరసత వయోజనులను ప్రోత్సహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ .రామారావు  సర్పంచ్  మరియు గ్రామప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Thursday, 25 May 2017

బాల్య వివాహాన్ని అడ్డుకున్న పోలీస్ అధికారులు

బాల్య వివాహాన్ని అడ్డుకున్న పోలీస్ అధికారులు 
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 25 ; (వుదయం ప్రతినిధి) ;  దహెగాం మండలంలోని గిరివెళ్లి గ్రామానికి చెందిన బాలిక(16) బాల్య వివహం అదే మండలంలోని  రాస్పెల్లి గ్రామానికి చెందిన తుమ్మిడి నానితో జూన్ 1వ తేదీన పెళ్లి అని తెలుసుకొని దహెగాం సబ్-ఇన్స్పెక్టర్ దికొండ రమేష్, వి .టి .ఓ ఎంబడి రమేష్  మరియు సిబంది వారిని హెచ్చరించి కౌన్సిలింగ్ నిర్వహించి వారి ప్రయత్నాలను విరమింపచేశారు.  ఈ  బాలిక కస్తూరిబా బాలికల పాఠశాల లో 9వ తరగతి చదువుతున్నది అని చదువుకునే వయసులో పెండ్లిలు చేస్తే ఆరోగ్య సమస్యలతో పాటు వారి చదువుకు ఆటంకం కలిగి భవిష్యత్తు దెబ్బతింటుంది అని బాలిక తల్లిదండ్రులకు  అవగహన కల్పించి మైనర్ వివాహలు  చట్టరిత్య నేరం అని బాలిక వివాహ వయస్సు కనీసం 18సంవత్సరాలు ఉండాలని వారి యొక్క ప్రయత్నాలను విరమింపచేశారు.

ప్రభుత్వ హాస్పత్రిలో అల్పాహారం పంపిణి

ప్రభుత్వ హాస్పత్రిలో అల్పాహారం  పంపిణి 
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 25 ; (వుదయం ప్రతినిధి) ;   సంఘ సేవ యూత్ సొసైటీ ఆద్యర్యం లో గురువారం నాడు   ఆసిఫాబాద్  లోని ప్రభుత్వ ఆస్పత్రిలో  రోగులకు అల్పాహారం పంపిణి చేసారు. ఈ సందర్బంగా సంఘం  అధ్యక్షులు జంజిరాల సంజీవ్ కుమార్ మాట్లాడుతూ సంఘం తరుపు నుండి ప్రతి గురువారం నాడు రోగులకు అల్పాహారం పంపిణీచేస్తున్నం అన్నారు. సంఘసేవ యూత్ సొసైటీ నుంచి మరిన్ని కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపారు.   ఈ  కార్యక్రమం లో  ఋణదాత మొండి , బి .చారి , రాజు , సంఘం సభ్యులు శివ వినీత్ , గణేష్ ,సాయి, రాజేశ్వర్ ,సి .సాయి నిఖిల్ లు పాల్గొన్నారు.

కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోషియేషన్ ఎన్నికలు 11న

కెమిస్ట్  అండ్  డ్రగ్గిస్ట్  అసోషియేషన్ ఎన్నికలు 11న 
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 25 ; (వుదయం ప్రతినిధి) ;  కుంరంభీం  జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జూన్ 11న  ఉదయం 11గంటలకు  కాగజ్ నగర్  లో  నిర్వహించనునట్లు అసోసియేషన్ అడహక్  కమిటీ జిల్లా కన్వీనర్ రమేష్ చంద్  బజాజ్ తెలిపారు . ఈ  సందర్బంగా అయన మాట్లాడుతూ  స్థానిక సంతోష్ ఫంక్షన్ హాలులో ఈ ఎన్నికలు నిర్వహించనున్నామని తెలిపారు ఈ  ఎన్నికలకు కుంరంభీం  జిల్లా లోని మెడికల్ దుకాణాల  యాజమానులు సకాలంలో హాజరు కావాలని  అన్నారు.  

Wednesday, 24 May 2017

కొనసాగుతున్న రైతు సర్వే


కొనసాగుతున్న రైతు సర్వే 
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 24 ; (వుదయం ప్రతినిధి) ;  రైతు సమగ్ర సర్వే  ను వ్యవసాయ అదికారులు చేపట్టారు బుధవారం రెబ్బన మండలం లోని అన్ని గ్రామా పంచాయితీల వారీగా ఇంటింటి సర్వే స్వీకరిస్తున్నట్లు ఏ ఓ మంజుల తెలిపారు. రైతులు ఈ సర్వే  కు తగిన సమాచారం తో సహకరించాలని కోరారు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టె సప్సిడీలను  ఈ సర్వే తోనే వెల్లడౌతాయని  అన్నారు. ఈ సర్వే లో సహాయ వ్యవసాయ అధికారి లు మార్క్ అర్చన తదితర  సిబ్బంది లు సర్వేను కొనసాగిస్తున్నారు.  

సిస్టం అప్లికేషన్ ప్రోడక్ట్స్ ల ఫై అవగాహనా సదస్సు

సిస్టం అప్లికేషన్ ప్రోడక్ట్స్ ల ఫై అవగాహనా సదస్సు

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 24 ; (వుదయం ప్రతినిధి) ;  సిష్టం అప్లికేషన్ ప్రోడక్ట్స్ ల ఫై విధి నిర్వహణ లో అది కారులు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని బెల్లంపెల్లి  ఏరియా జనరల్ మేనేజర్ కె రవి శంకర్ అన్నారు. బుధవారం రెబ్బెన మండలం లోని గోలేటి జనరల్ మేనేజర్ కార్యాలయంలో అధికారులకు సిష్టం అప్లికేషన్ ప్రోడక్ట్స్ ల గురించి అవగాహన సదస్సు ని ఏర్పాటు చేసి మాట్లాడారు.  ఈ కార్యక్రమంలో బెల్లంపెల్లి ఏరియా డిజిఎం పర్సనల్ జె చిత్తరంజన్ కుమార్.ఈ ఆర్ పి నుండి వచ్చిన ఎస్ వెంకటేశ్వర్ రావు . డివైపిఎం లు. బి సుదర్శన్ మరియు ఎల్ రామ శాస్రి . తదితరులు పాల్గొన్నారు.   

వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించాలి

వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించాలి                
    
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 24 ; (వుదయం ప్రతినిధి) ;  వాహనదారులు విధిగా ట్రాఫిక్ నియమాలను పాటించాలని రెబ్బెన ఎస్ ఐ నరేష్ కుమార్  అన్నారు.బుధవారం  రెబ్బెన ప్రధాన రహదారిపై  ప్రత్యేక వాహనా తనిఖీ లు నిర్వహించారు. ఈ సందర్బంగా  ఎస్ ఐ మాట్లాడుతూ  వాహన చోదకులు విధిగా శిరస్త్రణ ధరించాలని అన్నారు. ప్రతి ఒక్కరు వాహన చోదక అర్హత పత్రాన్ని కలిగి ఉండాలి అని అన్నారు. అదే విధంగా వాహనాలకు సంబంధించిన  దృవీకరణ పత్రాలు అయినా రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్,లైఫ్ టాక్స్ వంటి రవాణాశాఖ ఇచ్చిన పత్రాలు కలిగి ఉండాలని సూచించారు.సరైన పత్రాలు లేని వాహన యజమానులకు జరిమానా విధించారు. మైనర్ విద్యార్థులు వాహనాలు నడపకూడదని ఒక వేల నడిపినట్టైతే వారి తల్లిదండ్రులు శిక్షార్హులని హెచ్చరించారు.చోదకులు మద్యం సేవించి వాహనాలు నడపకూడదు అని  అన్నారు.

Tuesday, 23 May 2017

లాటరీ ద్వారా యాదవుల లబ్ది ఎంపిక

లాటరీ  ద్వారా యాదవుల లబ్ది ఎంపిక

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 23 ; (వుదయం ప్రతినిధి) ;   యాదవులకు తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీ ఫై  గొర్రేల  పెంపకానికి  మంగళవారం రెబ్బన మండలం  లోని నారాయణపూర్ లోని  40 లబ్ది దారులు దరఖాస్తులు చేసుకోగా మొదట విడతగా లాటరీ పద్దతి ద్వారా 20 మంది ని ఎంపిక చేయడం జరిగిందని పశు వైద్యాధికారి డాక్టర్ సాగర్ తెలిపారు.  ఎంపిక ఐనవారికి జూన్ నెలలో గోర్రేలు  అందజేస్తారని అన్నారు తెలంగాణ ప్రభుత్వం  లబ్ది చేకూరేలా రాయితీలని ప్రవేశ పెడుతూ అభివృద్ధి ఫై చేయూత నిస్తుందని అన్నారు  ఈ కార్యక్రమం లో.సర్పంచ్ వి వెంకటేశ్వర్లు .  మాజీ జడ్పిటిసి పల్లె ప్రకాష్ రావు . వార్డ్  సభ్యులు   పి శ్రీనివాస్.  తదితరులు పాల్గొన్నారు.

పోరాటాల ద్వారానే సమస్యలు పరిస్కారం

పోరాటాల ద్వారానే సమస్యలు పరిస్కారం 
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 23 ; (వుదయం ప్రతినిధి) ;    పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కరం  అవుతాయని ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ కార్యదర్శి ఎస్ . తిరుపతి  అన్నారు . మంగళవారం బెల్లంపల్లి ఏరియా ఖైరుగూడ  లో జరిగిన సమావేశంలో  మాట్లాడురు.  ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అన్ని గనులు , డిపార్టుమెంట్  ల వద్ద ధర్నాలు నిర్వహించి ఆయా మేనేజర్లకు వినతి పత్రంలను అందజేసామన్నారు . సింగరేణిలో ఎన్నికలను నిర్వహించి కోడ్  అఫ్ డిసిప్లిన్ ను మార్చాలన్నారు. యూనియన్ మెంబర్ షిప్ రికవరీ ని నిలిపి వేయాలని డిమాండ్ చేసారు . కార్మికుల సమస్యలను వెంటనే పరిస్కారం చేయాలనీ పలు సమస్యలతో కూడిన వినతి పత్రాలను అందజేశారు . ఈ  కార్యక్రమంలో యూనియన్ నాయకులూ  రాజేష్, సత్యనారాయణ, తిరుపతి, చారి , జనార్దన్ రెడ్డి, కిరణ్ బాబు, తదితరులు పాల్గొన్నారు. 

ఉపాధి హామీ కూలీలకు బకాయిల వేతనాలను చెల్లించాలి

ఉపాధి హామీ కూలీలకు  బకాయిల వేతనాలను చెల్లించాలి 
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 23 ; (వుదయం ప్రతినిధి) ;  రెబ్బెన మండలం లోని  గ్రామీణ ఉపాధి హామీ  కూలీలు పని చేస్తున్న వారికీ గత రెండు నెలలనుంచి కూలి చెల్లించడం లేదని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్.ఏఐటీయూసీ మండల కార్యదర్శి రాయాల నర్సయ్య లు . మంగళవారం ఓ ప్రకటన లో తెలిపారు గత సంవత్సరం  లో కూడా ఇంకుడు గుంతల బకాయిలు కూడా చెల్లించకపోవడం తో అప్పులు చేసి  నిర్మించారని అన్నారు.జాబ్ కార్డు ఉన్న వారందరికీ ఉపాధి కల్పించాలని అన్నారు.పని ప్రాంతం లో కనీస సౌకర్యాలు కల్పించకుండా నమమాత్రం  గా కొనసాగిస్తున్నారని ఈ ఎండా వేడిని తట్టుకోవడానికి టెంట్లు . మెడికల్ కిట్లు,       ఓ ఆర్ ఎస్  ప్యాకెట్లు ఇవ్వాల్సి ఉండగా అధికారుల పట్టింపు లేని కారణంగా క్షేత్ర స్థాయిలో అందడం లేదు అన్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు చొరువ తీసుకొని సౌకర్యాలు కల్పిస్తూ కూలీల వేతనాలు చెల్లించాలి అన్నారు.

ఇసుక ట్రాక్టర్ పట్టివేత

ఇసుక ట్రాక్టర్ పట్టివేత
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 23 ; (వుదయం ప్రతినిధి) ;  రెబ్బెన మండలం వంకులం  గ్రామానికి చెందిన వాగునుండి ఎలాంటి అనుమతి పత్రాలు  లేకుండా ఇసుక ను ఏ పి 24 ఈ 1090 ట్రాక్టర్ ధ్వారా  తరలిస్తుండగా రెబ్బెన తహశీల్ధార్ రమేష్ గౌడ్ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి జరిమానా విధిస్తాం అన్నారు. అనుమతి లేకుండా ఎలాంటి ఇసుక ను తరలించరాదని అయన తెలిపారు.

Monday, 22 May 2017

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందాం ; జి ఎం రవిశంకర్


తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందాం ; జి ఎం రవిశంకర్ 

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 22 ; (వుదయం ప్రతినిధి) ;  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందామని  బెల్లంపల్లి సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ కే. రవిశంకర్ అన్నారు. రెబ్బెన మండలంలోని గోలేటి జనరల్ మేనేజర్ కార్యాలయంలో సోమవారం సింగరేణి అధికారులకు ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ  సంవత్సరం కూడా తెలంగాణ ఆవిర్భావ వేడుకలను పండుగ వాతావరణం మధ్య ఘనంగా నిర్వహించుకోవాలని అధికారులకు సూచించారు సింగరేణి ప్రతి డిపార్టుమెంటల్ లో కూడా అందరు వేడుకలను జరుపుకోవాలన్నారు . ఆవిర్భావ దినోత్సవం రోజున ఉదయం 7:30 గంటలకు జి ఎం  కార్యాలయం నుండి తెలంగాణ రన్ కార్యక్రమం ఉంటుందన్నారు. అలాగే బెల్లంపల్లి ,మాదారం, గోలేటిలలో మహిళలకు ప్రత్యేకంగా ఆటలాపోటీలు మరియు దీపాలంకరణ పోటీల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సింగరేణి పాఠశాల  ప్రాంగణంలో సాయంత్రం 6 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. సింగరేణికి  సంబందించిన స్టాల్స్ తో పాటు తెలంగాణ వంటకాల స్టాల్ లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ  ఆవిర్భావ దినోత్సవంలో ప్రతి ఒక్కరు పాలుపంచుకొని పండుగ వేడుకలను విజయవంతం చేయాలనీ కోరారు.  ఈ  కార్యక్రమంలో డి జి ఎం పర్సనల్ జె. చిత్తరంజాన్ కుమార్, ప్రాజెక్ట్ ఆఫీసర్ సంజీవ రెడ్డి , మోహన రెడ్డి , దేవేందర్ ఎస్ ఓ టూ జి ఎం కొండయ్య , సీతారామ రావు , రామారావు , నర్సారెడ్డి ఏ  రాజేశ్వర్ , ఎల్ రామశాస్ట్రీ , అశోక్ ,  యూనియన్ నాయకులూ ఎస్ తిరుపాతి , సదాశివ్ తదితరులు పాల్గొన్నారు.

కిరోసిన్ పోసుకొని వ్యక్తి మృతి

కిరోసిన్ పోసుకొని వ్యక్తి మృతి 

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 22 ; (వుదయం ప్రతినిధి) ; రెబ్బెన మండల కేంద్రములో  గోలేటి గ్రామా పంచాయత్ లోని దూల పెట్ కు చెందిన టేకు రాజు ( 25 ) ఆదివారం రోజున  కిరోసిన్ పోసుకొని మృతి చెందినట్లు రెబ్బెన ఎస్ ఐ నరేష్ కుమార్ తెలిపారు. మృతుడి అన్న అయిన టేకు గోపాల్ పిర్యాదు   మేరకు గతంలో మానసిక ఆవేదనతో పలు మార్లు ఆత్మహత్య కు పాల్పడ్డాడు, ప్రతిరోజు ఊర్లలో గ్యాస్ రిపేర్ చేసి ఇంట్లో ఉండేవాడు . గతంలో లాగానే ఆలోచనలకూ గురై  ఆదివారం రోజు ఇంట్లో కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య కు పాల్పడగా 108 అంబులెన్సు లో బెల్లంపల్లి ఆసుపత్రి కి తరలించగా చికిత్స చేసి మంచిర్యాల ఆసుపత్రి కి పంపించారు .  అక్కడ చికిత్స చేసి కరీంనగర్ ఆసుపత్రికి రిఫర్ చేయగా అక్కడ చికిత్స పొందుతూ కరీంనగర్  ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపియాడని బాధితుల అన్న పిర్యాదు మేరకు   కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ తెలిపారు. 

Sunday, 21 May 2017

ఎంఎల్ఏ , ఎంఎల్సి లను విమర్శించే అర్హత ఏమాజి కి లేదు

ఎంఎల్ఏ , ఎంఎల్సి  లను విమర్శించే అర్హత ఏమాజి కి లేదు

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 21 ; (వుదయం ప్రతినిధి) ;     ఆసిఫాబాద్ జెడ్పిటిసిగా  కొనసాగుతున్న  కె హేమాజిని గత 2 సం,, క్రితమే పార్టీ నుండి బహిష్కరించిదని, ఎంఎల్ఏఎంఎల్సి  లను విమర్శించే అర్హత ఏమాజి కి లేదని ఎంపిపి సంజీవ్ కుమార్, జెడ్పిటిసి అజ్మరా బాబూరావ్ లు అన్నారు. ఆదివారం రెబ్బెన అతిధి గృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. గత 2 సం,, క్రితమే పార్టీ నుండి బహిష్కరించారని అలాటివారు ఈ రోజు ఇతర  పార్టీల కండువాలు కప్పుకుని తెలంగాణ ప్రజాప్రతినిధులను విమర్సచటము తగదని, సత్తా ఉంటే పదవికి రాజీనామా చేసి మల్లీ గేలిసి చూపాలన్నారు. స్ధానికంగా లేకపోయిన తెలంగాణ అభిమానముతో నెగ్గరని, ప్రవర్తనాతీరు నచ్చక తెలంగాణ పార్టీ అధిష్ఠానము తోలగిచ్చినట్లు తెలిపారు. తెరాస పార్టీ లొచ్చి వెల్లిపాయనని పత్రికా ప్రకటనలు వెలువర్చి తెలంగాణ ప్రజాప్రతినిధులను అడ్డుకుంటే ఊరుకోమూ అన్నారు. తెరాస రాష్ట ప్రభుత్వం అభివృద్ధి పనులు ఎంఎల్ఏ , ఎంఎల్సి ల ప్రజా సేవ చూసి ఇతర పార్టీల నాయకులు  పార్టీ లో చేరుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమం లో రెబ్బన మండల సర్పంచ్ పెసర వెంకటమ్మ. ఏఎంసీ ఉపాధ్యక్షురాలు కుదరపు శంకరమ్మ. ఉప్పు సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ కుమార్. సింగల్ విండో డైరెక్టర్ మధునయ్య. తెరాస నాయకులూ చిన్న సోమశేఖర్, మోడం సుదర్శన్ గౌడ్. పి రాజజ్వార్ రావు, రంగు శ్రీనివాస్ గౌడ్, సుధాకర్  తదితరులు పాల్గొన్నారు.

Saturday, 20 May 2017

పాలిటెక్నీక్ అడ్మిషన్లకై దరఖాస్తు చేసుకోండి

 పాలిటెక్నీక్ అడ్మిషన్లకై దరఖాస్తు చేసుకోండి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 20 ; (వుదయం ప్రతినిధి) ; సింగరేణి కాలరీస్ పాలిటెక్నీక్ లో చదువుటకు 2018సంవసరంకు గాను అడ్మిషన్ కొరకు నోటిఫికేడీషన్లు వెలువడిందని బెల్లం పల్లి ఏరియ డిజిఎం పర్సనల్ జె చిత్తరంజన్ కుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు ఈ నోటిఫికేషన్ లు ఈ పాలిటెక్నీక్  చదవడానికి సింగరేణి ఉద్యోగులు మాజీ ఉద్యోగులు పిల్లలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు . సింగరేణి కాలారిస్ పాలిటెక్నీక్ 150 సీట్లు ఉండగా సివిల్ 30. కంప్యూటర్ 30. ఎలక్రికల్  మరియు ఎలక్ట్రానిక్స్ 30. మెకానికల్ 30. మైనింగ్ 30. మొదలగు సీట్లు కేటాయించడం ఐనవి సింగరేణి కాలారిక్ పాలిటెక్నీక్ యందు జరుగు యాజమాన్యం కోట కౌంక్లింగ్ ధ్వారా ఈ సీట్లు భర్తీ చేయబడును అని తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులు ఈ నెల 25  సాయంత్రం 5గంటల లోపు దరఖాస్తులు మరియు ఆన్ లైన్ అప్లికేషన్లు పూర్తి చేసిన వారిని పరిగణ లోనికి తీసుకోబడుతుందని తెలిపారు.

యాదవుల సంక్షేమానికి తెరాస ప్రభుత్వం పెద్ద పీఠ

యాదవుల సంక్షేమానికి తెరాస ప్రభుత్వం పెద్ద పీఠ  

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 20 ; (వుదయం ప్రతినిధి) ; యాదవుల సంక్షేమానికి  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్ద పీఠ వేసిందని  ఎంపిపి సంజీవ్ కుమార్ అన్నారు. యాదవులకు తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీ ఫై  గొర్రల పెంపకానికి కి రెబ్బన మండలం లోని  గోలేటి  లో శనివారం 122 మంది  లబ్ది  దారులు దరఖాస్తులు చేసుకోగా మొదట విడతగా లాటరీ పద్దతి ద్వారా 50 శాతం లబ్ది దారులను ఎంపిక చేసారు.  గోలేటి  గ్రామ పంచాయితీలో  ఏర్పాటు చేసిన  గ్రామసభ లో ముఖ్య అతిధిగా ఎం పి పి సంజీవ్ కుమార్, జపిటీసీ అజ్మేర బాబురావు లు హాజరు అయి  మాట్లాడారు. ఒక్కొక్క యానిటీ కి 1. 25 లక్షల ఖర్చు అవుతుండగా ప్రభుత్వం 75 శాతం సబ్సిడీ అందిస్తుందని అన్నారు. యాదవుల గొల్ల కూర్మ లు తెలంగాణ సర్కారు ఇచ్చిన గొర్రెలను సంరక్షించుకొని ఆర్థికంగా ఎదగాలనే సీఎం కేసీఆర్ లక్ష్యం  అన్నారు.   లాటరీ ద్వారా  లబ్దిదారులను  ఎంపిక చేశారు. ఈ కార్యక్రమం లో  సర్పంచ్సర్పంచ్ తోట లక్ష్మణ్ ,ఎం పి డి ఓ సత్యనారాయణ సింగ్, పశువైద్యాధికారి సాగర్. ఏఎంసీ వైస్ చేర్మెన్ కుందారపు  శెంకరమ్మ. ఉప సర్పంచ్ రవి నాయక్, తెరాస మండల అధ్యక్షుడు పోటు శ్రీధర్ రెడ్డి. ఎంపీటీసీలు  మురళి భాయ్. వనజ . రంగు శ్రీనివాస్  తదితరులు పాల్గొన్నారు.

Friday, 19 May 2017

కుష్ఠు నివారణ పై అవగాహన సదస్సు

కుష్ఠు నివారణ పై అవగాహన సదస్సు 

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 19 ; (వుదయం ప్రతినిధి) ;   ; కుష్ఠు వ్యాధి నివారణ పై రెబ్బెన లోని కొండపల్లి  గ్రామములో సర్పంచ్  మాంతు మేర అధ్యక్షతన శుక్రవారం లేప్రో  సొసైటీ ఆధ్వర్యంలో  కుష్ఠు వ్యాధి పై డాక్టర్ శివరామ కృష్ణ       ఎస్ హెఛ్ జి గ్రూప్ మెంబర్స్ లకు   అవగా హన కల్పించారు .ఈ అవగాహనా సదస్సుకు ముఖ్య అతిధిగా లేప్రో  సొసైటీ పిఓ  రామానుజ చారి హాజరై మాట్లాడారు.  ఈ సందర్బంగా డాక్టర్ శివరామ కృష్ణ పాఠశాలల విద్యార్థులకు , గ్రామస్తులకు కుష్ఠు వ్యాధి , బోదకాలు వ్యాధి గురించి క్లుప్తంగా వివరించారు . ఈ కార్యక్రమములో  లేప్రో  సభ్యులు   స్వప్న , వార్డు మెంబర్లు ఎం తిరుపతి , మొండయ్య  ప్రజలు ఉన్నారు.

ఎండకు వెళితే జాగ్రత్తలు అవసరం - తహసిల్దార్

ఎండకు వెళితే జాగ్రత్తలు అవసరం - తహసిల్దార్
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 19 ; (వుదయం ప్రతినిధి) ; ఎండతీవ్రత ఎక్కువగా ఉన్నందున తప్పకుండ ప్రతీ ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని రెబ్బెన తహసిల్దార్ బి రమేష్ గౌడ్ అన్నారు .శుక్రవారం ఆయన మాట్లాడుతూ గత  ఏడాది కంటే ఉష్ణోగ్రతలు తీవ్రత అధికంగా ఉందని , ఎండకు వెళితే త్రాగు నీరు తప్పని సరి వెంట తీసుకెళ్లాలని , గొడుగు లేదా తలకు గుడ్డను కట్టు కోవాలని  అన్నారు . అదే విధంగా పిల్లలు , వృద్దులు ఎండకు బయటకు వెళ్లకూడదని ఆయన తెలిపారు . ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు వెంట ఉంచుకోవాలని పేర్కొన్నారు . ఎవై న పనులు ఉంటె 10 గంటల లోపే ముగించుకొని  సాయంత్రము  5 గంటల తరువాతే బయటకు వెళ్లాలని అన్నారు.

Wednesday, 17 May 2017

లక్కి డీప్ ధ్వార గొల్ల కురుమూల లబ్ది ఎంపిక

 లక్కి డీప్ ధ్వార గొల్ల కురుమూల లబ్ది ఎంపిక 
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 17 ; (వుదయం ప్రతినిధి) ;   రెబ్బన  మండలం లోని తుంగడ  గ్రామంలో గొర్రెల యూనిట్ల కోసం లబ్ధిదారులను బుధవారం లక్కీ డ్రా ధ్వర ఎంపిక చేసారు. తహశీల్ ధర రమేష్ గౌడ్ . ఎంపిడిఓ సత్యనారాయణ సింగ్ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం గొల్ల కురుమలు ఆర్థికంగా కుటుంబాల అభివృద్ధి  చెందాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ప్రతి గొల్లకురుమ కుటుంబాలకు 70 శాతం రాయితీతో గొర్రె ల యూనిట్లను మంజూరు చేసిందని ఈ యూనిట్ లో 20 గొర్రెలు, ఒక పొట్టేలు ఉంటుందన్నారు.తుంగడ గ్రామం లో నిర్వహించిన లక్కీ డ్రా లో 63 మంది లబ్దిదారులకు గాను 32 మందిని ఎంపికచేశారు. . ఈ కార్యక్రమంలో సర్పంచ్ జుమ్మిడి లక్ష్మి భాయ్. మండల పశు అధికారి సాగర్, పంచాయితీ కార్యదర్శి వంశీ కృష్ణ మాజీ జడ్పీటీసీ పల్లె ప్రకాష్ రావు . మాజీ సర్పంచ్ పి పర్వతాలు  మరియు తదితర గొల్ల కురుమలు పాల్గొన్నారు.

గొల్ల కురుమూల లబ్ది ఎంపిక

గొల్ల కురుమూల లబ్ది ఎంపిక 
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 17 ; (వుదయం ప్రతినిధి) ;  గొల్లకురుమల 70 శాతం రాయితీతో గొర్రె ల యూనిట్లను  మంజూరు చేసారని, ఆర్థిక అభివృద్దే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లబ్ది చేకూరేలా రాయితీలని ప్రవేశ పెడుతూదని ఎం ఎల్ ఏ కోవ లక్ష్మి అన్నారు.  బుధవారం కోమరంభీం జిల్లా: అసిఫాబాద్ మండలం లోని చిర్రకుంటా గ్రామంలో గొర్రెల పెంపకం ప్రత్యేక ప్యాకేజీ లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమనికి ముఖ్య అతిథులు గా ఎమ్మెల్యే  కోవా లక్ష్మి, జిల్లా కలెక్టర్ చంపాలాల్ లు  హాజరై లక్కి డీప్ ద్వార లబ్ది దారులను ఎంపిక చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ 75శాతం రాయితీలలో  మంజూరు చేసిన గొర్రెల పెంపకం చేపట్టి ఆర్థికంగా లాభాల బాటలో ఉండాలన్నారు.   ఆసిఫాబాద్  మార్కెట్ ఛైర్మన్ గందం శ్రీనివాస్, సర్పంచ్ మేకర్త్ కాశయ్య, మండల పశు అధికారి శ్రీకాంత్,  తదితర గొల్ల కురుమలు పాల్గొన్నారు.

అంగన్‌వాడీ కేంద్రాలలో సక్రమంగా విధులు నిర్వహించాలి

అంగన్‌వాడీ కేంద్రాలలో సక్రమంగా విధులు నిర్వహించాలి 

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 17 ; (వుదయం ప్రతినిధి) ;  అంగన్‌వాడీ కేంద్రాలలో విధులను సక్రమంగా నిర్వహించాలని పి డి సావిత్రి అన్నారు. బుధవారం రెబ్బన మండల కేంద్రం లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అంగన్‌వాడీ కార్యకర్తలకు  ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు ప్రతి రోజు అంగన్‌వాడీ సెంటర్ నుంచి  ఓ టీ పి  సంఖ్యను సెల్ ఫోన్ నుంచి సూపర్వైజర్లకు  అందించాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు కోడి గుడ్లు అందించిన సంఖ్య  సమాచారం అందజేయాలి అన్నారు. ఒక  వేళా కోడిగుడ్ల రాకపోయిన  సమాచార వివరాలను సూపర్ వెజర్లకు తెలియజేయాలని సూచించారు వచ్చే నెలనుంచ్చి అంగన్‌వాడీ కేంద్రాలు సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలు విలీనం చేశా అవకాశం ఉన్నాయ్ అన్నారు ఫ్రీ   స్కూల్ పిల్లలకు ఆకర్షించే  అందుకు  ఆటపాటలతో ఆడించాలి అన్నారు గర్భిణీలు ప్రభుత్వ హాస్పత్రి లోనే ప్రసవించేలా ఉండకలని చించారు ఈ కార్యక్రమం లో సిడిపిఓ రాజేశ్వరి.సూపెర్వైజర్ లక్ష్మి.అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Tuesday, 16 May 2017

పంట మార్పిడితో బహు ప్రయోజనాలు

పంట మార్పిడితో బహు  ప్రయోజనాలు 
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 16 ;  రెబ్బెన మండలంలోని నవేగం, వాంకులంలో మన తెలంగాణ మన వ్యవసాయం మంగళవారం నిర్వహించారు. బిటిఎం గురుమూర్తి,వ్యవసాయ అధికారి మంజుల లు  రైతులకు అవగాహనా కల్పించారు. పంట మార్పిడితో అధిక లాభాలు వస్తాయని అన్నారు. రసాయన ఎరువుల వడకాని తగ్గించి సేంద్రియ ఎరువులను వినియోగించాలని సూచించారు. రసాయన ఎరువులు వాడటం వాళ్ళ భూ సారం తగ్గుతుందని ఎప్పటి కప్పుడు పంట మార్పిడి చేసి అంతర పంటలు వేస్తే  రైతులు లాభాల బాటలో ప్రయాణించచ్చు  అన్నారు.  ప్రభుత్వం సబ్సిడీ పై విత్తనాలు మరియు కల్టివేషన్, డ్రిప్పింగ్ పైపులను వినియోగించుకోవాలన్నారు. ఈ సదసులో  వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

ప్రభుత్వం అన్ని వర్గాలకు చేయూత ; ఎం ఎల్ ఏ కోవ లక్ష్మి

ప్రభుత్వం అన్ని వర్గాలకు చేయూత ; ఎం ఎల్ ఏ కోవ లక్ష్మి
 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 16 ; (వుదయం ప్రతినిధి) ;  గొల్లకురుమల ఆర్థిక అభివృద్దే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ,  వీరితో పటు అన్నివర్గాల  ప్రజల కు లబ్ది చేకూరేలా రాయితీలని ప్రవేశ పెడుతూ ఆర్ధిక అభివృద్ధి కి తోడ్పడుతున్నదని ఎం ఎల్ ఏ కోవ లక్ష్మి అన్నారు. మంగళవారం ఆసిఫాబాద్ మండలం లోని బూరుగూడా గ్రామంలో గొర్రెల యూనిట్ల కోసం లబ్ధిదారుల ఎంపిక లక్కీ డ్రా కార్యక్రమానికి విచ్చేసిన ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం గొల్ల కురుమలు ఆర్థికంగా కుటుంబాల అభివృద్ధి  చెందాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ప్రతి గొల్లకురుమ కుటుంబాలకు 75శాతం రాయితీతో గొర్రె ల యూనిట్లను మంజూరు చేసిందని ఈ యూనిట్ లో 20 గొర్రెలు, ఒక పొట్టేలు ఉంటుందన్నారు. బూరుగుడా గ్రామం లో నిర్వహించిన లక్కీ డ్రా లో76 మంది లబ్దిదారులకు గాను 38 మందిని ఎంపికచేశారు. . ఈ కార్యక్రమంలో  ఆసిఫాబాద్  మార్కెట్ ఛైర్మన్ గందం శ్రీనివాస్, సర్పంచ్ మేకర్త్ కాశయ్య, మండల పశు అధికారి శ్రీకాంత్, ఎం పి టి సి చౌదరి గోపాల్, తెరాస నాయకులూ మరియు తదితర గొల్ల కురుమలు పాల్గొన్నారు.

గొల్ల కుర్మలకు తెలంగాణ ప్రభుత్వం చేయూత

గొల్ల కుర్మలకు తెలంగాణ  ప్రభుత్వం చేయూత 
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 16 ; (వుదయం ప్రతినిధి) ; తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గొల్లకురుమల చేయూతనియ్యడం సంతోష కరం అని ఎం పి పి సంజీవ్ కుమార్ అన్నారు.  యాదవులకు తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీ ఫై  గొర్రల పెంపకానికి కి రెబ్బన మండలం  లోని ఖైర్గం లో మంగళవారం  20 మంది  లబ్ది  దారులు దరఖాస్తులు చేసుకోగా మొదట విడతగా లాటరీ పద్దతి ద్వారా 10  మంది ని ఎంపిక చేసారు.  ఖైగాం గ్రామ పంచాయితీలో  ఏర్పాటు చేసిన  కార్యక్రమాన్ని కి ముఖ్య అతిధిగా ఎం పి పి సంజీవ్ కుమార్  హాజరు అయి  మాట్లాడారు.  లాటరీ ద్వారా  లబ్దిదారులను  ఎంపిక చేశారు. ఈ కార్యక్రమం లో  సర్పంచ్ సులోచన,ఎం పి డి ఓ సత్యనారాయణ సింగ్, పశువైద్యాధికారి సాగర్. ఈఓపీఆర్డ్ కిరణ్ కుమార్,పంచాయితీ కార్యదర్శి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Monday, 15 May 2017

గొర్రల పంపిణీకి లబ్ది దారుల ఎంపిక

గొర్రల పంపిణీకి లబ్ది దారుల ఎంపిక 
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 15 ; (వుదయం ప్రతినిధి) ;   యాదవులకు తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీ ఫై  గొర్రల పెంపకానికి కి రెబ్బన మండలం  లో 26 లబ్ది దారులు దరఖాస్తులు చేసుకోగా మొదట విడతగా లాటరీ పద్దతి ద్వారా 13 మంది ని ఎంపిక చేసారు సోమవారం రెబ్బన గ్రామా పంచాయితీ లో ఏర్పాటు చేసిన  కార్యక్రమాన్ని కి ముఖ్య అతిధిగా ఎం పి పి సంజీవ్ కుమార్  హాజరు ఐ మొదటి లాటరీ చిట్టి ని తెరవగా లబ్ది దారిగా చిన్నమనేని దేవక్క ఎంపిక అయింది  ఇమె తో పాటు మరో 12 మంది లబ్దిదారులు ఎంపిక అయ్యారు ఎంపిక ఐనవారికి జూన్ నెలలో గోరెలు అందజేస్తారని అన్నారు తెలంగాణ ప్రభుత్వం అన్ని తరహాల ప్రజల కు లబ్ది చేకూరేలా రాయితీలని ప్రవేశ పెడుతూ అభివృద్ధి ఫై చేయూత నిస్తుందని అన్నారు  ఈ కార్యక్రమం లో రెబ్బన మండల సర్పంచ్ పెసర వెంకటమ్మ. తహశీల్ ధార్ రమేష్ గౌడ్, ఎం పి డి డి ఓ సత్యనారాయణ సింగ్  .ఏఎంసీ ఉపాధ్యక్షురాలు కుదరపు శంకరమ్మ .ఉప్పు సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ కుమార్.  పశువైద్యాధికారి సాగర్. ఏపీఎం వెంకటరమణ. వైస్ ఎం పి పి గుడిశల రేణుక. సింగల్ విండో డైరెక్టర్ మధునయ్య .  తెరాస నాయకులూ చిరంజీవి గౌడ్. మోడం సుదర్శన్ గౌడ్ . మడ్డి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 

తక్కళ్లపల్లి లో రైతుల అవగాహనా సదస్సు

తక్కళ్లపల్లి లో రైతుల అవగాహనా సదస్సు 
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 15 ; (వుదయం ప్రతినిధి) ;  రెబ్బెన మండలం లోని తక్కళ్లపల్లి గ్రామంలో సోమవారం మన తెలంగాణ -మన వ్యవసాయం రైతులకు అవగాహనా  సదస్సును  వ్యవసాయ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా వ్యవసాయ అధికారిని మంజుల మాట్లాడుతూ ఈ నెల 5 నుంచి రాష్ట్ర  ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా  నేడు ఏర్పాటు చేసిన రైతు సదస్సులను మండలం లోని అన్ని గ్రామా పంచాయితీ ల రైతులకు  అవగాహనా కల్పింస్తు చైతన్య పరుస్తున్నాం అన్నారు .  ఆధునిక పద్దతి లో మెలుకువలు పాటిస్తూ  సేంద్రియ ఎరువులకు ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు.  నాణ్యమైన విత్తనాలను  ఎంపిక చేసి గుర్తింపు పొందిన కంపెనీల విత్తనాలనే నాటితే ఎక్కువ దిగుబడులు వస్తాయని అన్నారు.తక్కువ రేటులో విత్తనాలను కొనుగోలు చేసి దిగుబడులు లేక రైతులు నష్టపోతున్నారని. రాయితీ ఫై ప్రభుత్వం ప్రవేశ పెట్టె విత్తనాలను నాటితే అధిక దిగుబడులు దోహద పడుతాయని అన్నారు. ఈ అవగాహన సదస్సులో  గ్రామ సర్పంచ్ చిన్నయ్య. వ్యవసాయ సిబ్బంది అర్చన. రవీందర్ తదితర రైతులు  పాల్గొన్నారు.

Saturday, 13 May 2017

సింగరేణి లో బయోమెట్రిక్

సింగరేణి లో బయోమెట్రిక్ 
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 13 ; (వుదయం ప్రతినిధి) ;  భారత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన డిజిటల్ సేవ కార్యక్రమం లో భాగంగా బెల్లంపల్లి ఏరియా సింగరేణి ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా అజారు శాతాన్ని నమోదు చేయున్నట్లు డిజిఎం జె చిత్తరంజన్ కుమార్ శనివారం ఒక ప్రకటన ధ్వారా తెలిపారు. కార్మికులు బయోమెట్రిక్ సేవను వినియోగించు కోవడానికి ముందుగా వారి యొక్క జాబితాను ఆన్ లైన్ లో భద్ర పరుచు కోవాలని పేర్కొన్నారు. సింగరేణి ఏరియా లో పని  చేస్తున్న ఉద్యోగులందరూ ఆదర్ కార్డు అనుసంధానం తో జాబితాలను సకాలం లో అందజేసి అం లైన్ లో సేవ్ చేసుకోవాలని అన్నారు.

ధర్నా చౌక్ ని ఎత్తి వేస్తే ఆందోనలు కొనసాగిస్తాం జె ఏ సి నాయకులు

ధర్నా చౌక్ ని ఎత్తి వేస్తే ఆందోనలు కొనసాగిస్తాం జె ఏ సి నాయకులు 




కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మే 13 ; (వుదయం ప్రతినిధి) ;   ఇందిరా పార్క్ నుంచి ధర్నా చౌక్ ని తరలిస్తే ఊరుకోమని  తెలంగాణ జె ఏ సి నాయకులూ ఎల్ రమేష్.బోగే ఉపేందర్ లు అన్నారు శనివారం రెబ్బన మండలం కేంద్రం లోని ఆర్ ఎం డి భవన ఆవరణలో ధర్నా చౌక్ కు సంబంధించిన  వాల్  పోష్టర్లను విడుదల చేసి మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన నిరసన హక్కును తరలించద్దని ధర్నా చౌక్ ఎత్తివేస్తే హైదరాబాద్ నగరం అంత ధర్నా చౌక్ గ మారుతుందని ధర్నా చౌక్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ నెల 15 వ తేదీన ధర్నా చౌక్ నిర్ణయిస్తామని అన్ని రాజకీయ పార్టీలు నాయకులూ విద్యార్థులు మేధావులు ప్రత్యేక తెలంగాణ రాష్టం ఏర్పడిన తర్వాత మరింత స్వేచ్ఛ ఉంటుందని భావించామని అనుకున్నాం కానీ ధర్నా చౌక్ ని ఎత్తివేసి కేసీఆర్ ప్రజా స్వామ్యాన ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వానికి మీ చర్యలు నిదర్శనం అని రాష్టం లో అన్ని వర్గాల ప్రభుత్వాల ఫై అసంతృప్తిగా ఉన్నాయని 20 ఏళ్లుగా ధర్నా చౌక్ గ ఉన్న ఈ [ప్రదేశాన్ని ఎత్తి  వేయడం చాల బాధాకరం అని అన్నారు రాష్టం లో టీఆర్ఎస్ కేవలం రాజకీయ పరిపాలన చేస్తున్నారని ప్రజలకు మంచి  కోరే పని చెయ్యడం లేదని అన్నారు.  ఈ కార్యక్రమం లో  ఏఐటీయూసీ మండల కార్యదర్శి రాయల నర్సయ్య.బీజేపీ మండల అధ్యక్షుడు కుంధారపు బాలకృష్ణ. టీడీపీ మండల అధ్యక్షుడు సంగం శ్రీనివాస్. కాంగ్రెస్ నాయకుడు కొవ్వూరి శ్రీనివాస్.పూదరి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.