సబ్ స్టేషన్ రోడ్ ను పట్టించుకొనే వారే లేరా ...
( సబ్ స్టేషన్ రోడ్డు ఫైల్ వర్షాకాలపు ఫోటో )
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలములో ప్రధాన రోడ్ అయిన సబ్ స్టేషన్ రోడ్ పట్టించుకొనే వారే లేరా అని విద్యార్థుల తల్లి తండ్రులు ఆవేదన చెందుతున్నారు . గత గ్రామ సభ లో సభ్యులు తీర్మానం చేయాలని తెలిపారు . అయిన ఎంత వరకు రోడ్ కు మోక్షము లేదని వారు పేర్కొన్నారు . ఆ రోడ్ కు రెబ్బెన ప్రాథమిక పాటశాల , విద్యుత్ సబ్ స్టేషన్ , అంగాన్ వాడి కేంద్రము,సాయి విద్యాలయం ప్రైవేటు పాటశాల ఉన్నాది . ఈ రోడ్ తో ఎప్పుడు విద్యార్థులు , రైతులు , ప్రజలు నడుస్తూ బిజీ బిజీ గా ఉంటుంది . వర్షా కాలము లో మాత్రం చెప్పనక్కర్లేదు . చెప్పులు చేత్తో పట్టుకొని నడాల్సిందే . గ్రామ సభ లో మండల తెలుగు దేశం అధ్యక్షుడు మోడెమ్ సుదర్శన్ గౌడ్ సబ్ స్టేషన్ రోడ్ సమస్యను గ్రామా అధికార్లకు తెలిపారు . దీని పై తీర్మానం కూడా చేశారు . ఐన ఇంత వరకు గ్రామా దికార్లు పట్టించుకోక పోవడము శోచనీయము అంటున్నారు ప్రజలు .
No comments:
Post a Comment