రిసోర్సు సెంటరు లో పి.ఆ.ర్ .టి .యు క్యాలండర్ విడుదల
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలములోని మండల రిసోర్సు సెంటరు లో శనివారము రోజున 2016-క్యాలండర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా పి ఆర్ టి యు ప్రధాన కార్యదర్శులు తిరుమల్ రెడ్డి , ఇన్నా రెడ్డి లు మాట్లాడుతూ పిల్లలు ప్రభుత్వ పాటశాల లో చదివి పించాలని, మన ముఖ్య మంత్రి ప్రవేశ పెట్టె కేజి - పిజి విద్య ను ప్రజలందరు తమ పిల్లలకు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమములో రాష్ట్ర ఉపాధ్యక్షుడు జనార్ధన్ , జిల్లా ఆర్గనైజర్ కార్యవర్గ శంకర్ రావు ,మండల అధ్యక్షుడు ఖాదర్ , ప్రధాన కార్యదర్శి రవి కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు సదానందం , శంకర్, రవీందర్ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment