Friday, 8 January 2016

ఘనంగా కొలవార్ భీమ దేవర జండా పండుగ

ఘనంగా కొలవార్ భీమ దేవర జండా పండుగ  

రెబ్బెన: (వుదయం ప్రతినిధి): రెబ్బెన మండలంలోని గిరిజన గ్రామాలలో కొలవార్ భీమ దేవర జండా పండుగను  ఘనంగా జరుపుకున్నారు. కొలవార్  సంఘం మండల అద్యక్షుడు మైలారం శ్రీనివాస్, బుర్స పొచమల్లు, ఎర్గటి సుధాకర్ లు  మాట్లాడుతూ కొలవార్ భీమ దేవర  జండా పండుగ 14వ వార్షికోత్సవాలను ఆయ గ్రామాలలో జండాను ఎగురవేసి సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణం జరుపుకుంటున్నామని వారు అన్నారు. మండలం లోని పలు గిరిజన గ్రామాల నుండి గ్రామా కొలవార్  సంఘం అద్యక్షులు జండాను ఎగురవేసి తమ పండుగ విశిష్టతను గ్రామా ప్రజలకు తెలియజేసారు. ఈ సందర్భం గా  పులికుంట నుండి బుర్స మారయ్య, టేకం భిమయ్య, ఎర్గటి సత్తయ్య, రోల్లపాడు లో  మాడె గణపతి, కొత్తగూడెం లో  కోడిపె వెంకటేశం, టకం హన్మంతు , నంబల లో పుదరి గణేష్, తుంగెడ లో బండి తులసిరామ్, నక్కల గూడ లో శ్యంరావు , ఇందిరా నగర్  లో తుమ్మరి మల్లేష్, ఎడవెల్లి  లో తుమ్మరి సన్యాసి జండాను ఎగురవేసినట్లు వారు పేర్కొన్నారు.  ఈ  8 రోజుల పండగను పురాతన సంప్రదాయాలకు అద్దం  పట్టే విధంగా జరుపుకోవాలని, తమ సంప్రదాయాలను మరవరాదని ఈ సందర్భం గా వారు కొరుకున్నరు.

No comments:

Post a Comment