రక్త దానం చేయండి ప్రాణాలు కాపాడండి

రెబ్బెన: (వుదయం ప్రతినిధి) వివేకానందా 153 జయంతి సందర్భంగా రెబ్బెనలో మంగళవారం నాడు ఇంఫ్యాక్ట్స్ స్వచ్చంద సంస్థ అధ్వర్యంలో వివేకనందుకి పూలమమలలు వేశారు అనంతరం అవయవ దానం చేసిన వినయ్ తల్లిదండ్రులకు అలాగే, 20 వ సారి రక్తదానం చేసిన జైశ్వాల్ వినోద్ కు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపిపి సంజీవ్ మాట్లాడుతూ ఒకరు రక్త దానం చేస్తే మరొకరి ప్రాణాన్ని కాపాడవచ్చని , రక్త దానం చేయడానికి యువతీ యువకులు ముందుకు రావాలని, రక్తం దానం చేయడంతో ఎలాంటి హాని జరగదని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ హరినాధ్, కోఆర్డినేటర్ గొగర్ల శోభన్ బాబు, జడ్పిటిసి బాబురావు, ఎమ్మార్వో రమేష్ గౌడ్, , మాజీ ఎమ్మార్వో సుభాష్, సర్పంచ్ పెసరు వెంకటమ్మ, ఏమ్పిడివో ఎంఎ హలీమ్, ప్రిన్సిపాల్ అమీర్ ఉస్మాని తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment