కొలవార్ భీమ దేవర జండా పండుగను ఘనంగా జరుపుకోవాలి
కొలవార్ భీమ దేవర జండా పండుగను గిరిజన గ్రామాలలో జరుపుకోవాలని ఆదివాసీ కొలవార్ సంఘం మండల అద్యక్షుడు మైలారం శ్రీనివాస్ అన్నరు. రెబ్బెన మండలంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 8వ తేది నుండి 15వ తేది వరకు "భీమ దేవర జండా పండుగ" 14వ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నామని అన్నారు. ఈ పండుగను ఆయా కొలవార్ గిరిజన గ్రామాలు మరియు గిరిజన గుడాలలో జరుపుకొని తమ జాతి ఔన్నత్యాన్ని చాటుకోవాలని, తమ పురాతన సంప్రదాయాలను మరవరాదని ఈ సందర్భం గ అయన కోరారు. ఈ సమవేశం లో మండల ఉపాధ్యక్షుడు కోడిపె వెంకటేష్, మండల కార్యదర్శి బుర్స . పొచమల్లు,తుడుం దెబ్బ మండల అద్యక్షుడు ఎర్గటి సుధాకర్, తుడుందెబ్బ మండల కార్యవర్గ సభ్యుడు ఎర్గటి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి
సింగరేణి
గోలేటి 1-ఏ ను పూర్తి స్థాయిలో నడిపించాలి
బెల్లెంపల్లి ఏరియ లో ఉన్న ఏకైక బొగ్గు గనిని పూర్తి స్తాయులో నడిచేవిదంగా చూడాలని ఎ,అయ్,టీ,యు,సి ఆధ్వర్యంలో బుధవారం వినతి పత్రాన్ని ఇచ్చారు. ఎ,అయ్,టీ,యు,సి బ్రాంచ్ కార్యదర్శి ఎస్, తిరుపతి మాట్లాడుతూ ఓసి ల పేరుతో సింగరేణి యాజమాన్యం వందల ఎకరాలు భూసేకరణ చేస్తున్నారని, గోలేటి 1-ఏ కోసం భూసేకరణ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. కొన్ని సామ్, లుగా భూగర్భ గనిని కాపాడుకుంటూ కార్మికులు కాపాడుకుంటున్నారని అన్నారు. కామికుల బదిలీలు చేయకుండా గనిని నడిచే విధంగా చూడాలని అన్నారు.
No comments:
Post a Comment