నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని తీస్తుంది ----సి ఐ కరుణాకర్
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); చిన్న నిర్లక్ష్యం నిండు ప్రాణాల్ని తీస్తుందని తాండూర్ సి ఐ కరుణాకర్ అన్నారు .భద్రత వారోత్సవలోల భాగంగారెబ్బెన లో ని విశ్రాంతి భవనములో ఏర్పాటు చేసిన అవగాహనా సదస్సులో తాండూర్ సి ఐ కరుణాకర్ మాట్లాడారు. వాహనదారులు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని, వాహనదారులు తప్పక హెల్మెట్ ధరించాలని, తగిన వాహన పత్రాలు ,డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని లేనివారికి లారీ యజమానులకు జరిమానా, లారీని సీజ్ చేస్తామని సూచించారు.ద్వి చక్ర వాహన దారులు మద్యం సేవించి వాహనం నడపరాదని పేర్కొన్నారు . మొదటి సారి పట్టు బడితే 5రోజులు జైలు శిక్ష , రెండవ సారి ఒక నెల జైలు శిక్షతో పాటు లైసంసు సస్పెన్షన్ చేస్తామని అదేవిదంగా మూడవ సారి పట్టు బడితే పూర్తిగా లైసెన్సు రద్దు చేస్తామని అన్నారు అటోడ్రైవర్లు ముందు సీటులో ఎవరిని కూర్చపెట్టకూడదనితెలిపారు. పోలీస్ సిబ్బంది, వాహనదారులు లారి యజమానులు పాల్గొన్నారు
No comments:
Post a Comment