Wednesday, 27 January 2016

సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్‌ సంఘం అధ్యక్షుడు

సింగరేణి  కాంట్రాక్టు వర్కర్స్‌ సంఘం అధ్యక్షుడు - ఏఐటీయూసీ బోగే ఉపేందర్‌
(రెబ్బెన వుదయం ప్రతినిధి); సింగరేణిలో గత 15 సం,, నుంచి పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులను కాంట్రాక్టరు మార్చినంత మాత్రన కార్మికులను మర్చరాదని ,కార్మికుల సకల జనుల సమ్మె  వేతనాలు చెల్లించాలని సింగరేణి  కాంట్రాక్టు వర్కర్స్‌ సంఘం అధ్యక్షుడు ఏఐటీయూసీ బోగే ఉపేందర్‌ అన్నారు. ఆదివారం రెబ్బెన గోలేటి ఏఐటియుసి కార్యాలయంలో ఏర్పాటు చేసినా  విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కొనసాగించాలని, సకల జనుల సమ్మెలో పాల్గొన్న కార్మికులకు వడ్డీతో సహా వేతనాలు చెల్లించాలని, తెలంగాణ ఇంక్రిమెంట్‌ బేసిక్‌కు కలపాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్టంలో నిస్వార్ధంగా 35 రోజులు పాటు సమ్మెలో పాల్గొన్న  కాంట్రాక్టు కార్మికులకు  వేతనాలు ఇవ్వాలని,కార్మికులు ఒకానొక సమయంలో ఉపసలు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడినది.  బెల్లంపల్లి ఏరియ గోలేటిలో సివిల్ అధికారుల నిర్లక్షంతో కంట్రాక్టర్ కార్మికులకు సరైన కాలంలో వేతనాలు అందడం లేదని,అలాగే కంట్రాక్టర్ పెరిగిన వేతనాలు ఇవ్వాలని అన్నారు. ఆసుపత్రి అవసరం కొరకు పుస్తకాలు అందరికి ఇవ్వాలని అన్నారు ఇప్పటికి అయినా సింగరేణి గుర్తింపు సంఘంగా ఉన్న టి బి జి కే స్ సింగరేణి యాజమాన్యంమీద ఒత్తిడి తెచ్చి కంట్రాక్టర్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో గోలేటి బ్రాంచి కార్యదర్శి చల్లూరి అశోక్, ఉపాధ్యక్షుడు లేకురి సుధాకర్, సహాయ కార్యదర్శిలు అర్ మల్లేష్, కుమార్, రాంకుమార్ పాల్గొన్నారు.

No comments:

Post a Comment