నిరక్షరాశ్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి
రెబ్బెన మండలం లోని గోలేటి లో చదువు పై అవగాహనా సదస్సు బుదవారం నాడు ఏర్పాటు చేయటం జరిగింది ఇందులో యం పి డి ఓ యం ఏ అలీం మాట్లాడుతూ ఉపాది హామీ మేట్లు రోజుకు అరగంట సమయం వెచ్చించి కనీసం సంతకం పెట్టి, అంకెలు గుర్తించే విధంగా ఉపాది హామీ కూలీలను తాయారు చేయాలనీ అన్నారు. అంగన్ వాడి కార్యకర్తలు గర్భిని స్త్రీ లకు, పిల్లలకు మరియు పిల్లల తల్లిదండ్రులకు చుట్టుపక్కనవాళ్ళకి, సాక్షరభారత్ కార్యకర్తలు నిరక్షరాస్య వయోజనులకు విద్యను అందించాలని ఈ సందర్భం గా కోరారు. ఈ విధంగా మండలంలో నిరక్షరాస్యతను పారద్రోలచ్చని ఆయన అన్నారు. ఈ సదస్సు లో సాక్షర భారత్ కో-ఆర్డినేటర్ సాయిబాబా, ఐ సి డి ఎస్ సూపర్ వైసర్ లక్ష్మి, గోలేటి ఫీల్డ్ అసిస్టెంట్, మండలంలోని అంగన్ వాడి కార్యకర్తలు, సాక్షర భారత్ ఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment