రోహిత్ ఆత్మహత్య కు కారకులైన వారిపై ఎస్సి ఎస్టి అట్రసిటీ కేసులు :
సి పి యం డివిజన్ కమిటీ సభ్యులు
సి పి యం డివిజన్ కమిటీ సభ్యులు
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన పీహెచ్‌డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య కు కారకులైన బందరు దత్తాత్రేయను , కేంద్రమంత్రి స్మృతి ఇరాని ని వెంటనే ఎస్సి ఎస్టి అట్రసిటీ కేసులు పెట్టి కటినం గా శిక్షించాలని రెబ్బెన మండల కేంద్రం లోని సి పి యం ఆధ్వర్యములో ఆసిఫాబాద్ డివిజన్ కమిటీ సభ్యులు శనివారము రోజున స్థానిక అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని ఇచ్చి నిరసన వ్యక్తం చేసారు . ఈ సందర్భంగా డివిజన్ కమిటీ సభ్యులు దుర్గం దినకర్ మాట్లాడుతూ ఆనాడు బాబా సాహెబ్ అంబేద్కర్ మతం మత్తులాంటిదని, మను వాదాన్ని ,దాని సాహిత్యాన్ని తగలబెట్టాలని కోరిన గొప్ప నాయకుడని కొనియాడారు. కానీ ఈరోజుల్లో హిందుమతోన్మదులు చెలరేగి దళితులపై దాడులు చేస్తున్నారు. రోహిత్ 'నేను దళితునిగా పుట్టడం నేరమా' అని మానసికంగా ఎంతో ఆవేదన చెందాడని, బి జె పి అధికారం లోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగాయని అన్నారు. రోహిత్ చేసుకున్నది ఆత్మహత్య కాదని అది బి జె పి కేంద్రమంత్రులు చేసిన హత్యగానే పరిగణించాలని వారు ఈ సందర్భం గా డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమం లో ఇప్ప ప్రసాద్ , సుధాకర్ సి ఐ టి యు నాయకులు , దుర్గం మల్లు బై,ఎస్ కె సహెర బేగం , ఎస్ కె రజీయాలు పాల్గొన్నారు.
No comments:
Post a Comment