వారసత్వ ఉద్యోగాలు కల్పించాలి -----ఎ ఐ టి యు సి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి) సింగరేణి సంస్థలో వారసత్వ ఉద్యోగాలు వెంటనే అమలు పరచాలని ఎ ఐ టి సి గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్ తిరుపతి అన్నారు . గోలేటి లోని జి ఎం కార్యాలయం ముందు మంగళవారం ధర్నా నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకల జనుల సమ్మె కాలపు వేతనాలు వెంటనే చెల్లించాలని అన్నారు . గోలేటి 1 ఎ గనిని పూర్తి స్తాయీలో నడిపించాలని , కాంట్రాక్ట్ కార్మికులకు హాయ్ పవేర్ కమిటి వేతనాలను ఇవ్వాలని , కన్త్రాక్కారు మారిన కార్మికులు మారవద్దని తెలిపారు .కార్మికులకు సొంత ఇంటి పథకాన్ని అమలు పరచాలని డిమాండ్ చేశారు . ఈ ధర్నా లో నాయకులూ ఎం లక్ష్మి నారాయణ నరసింహా రావు ఎం రామ రావు సోకాల శ్రీనివాస్ బి జగ్గయ్య ఎం శేషు ఎస్ సంపత్ రావు వెంకటేష్ శివ రావు ప్రకాష్ బిక్షమయ్య సత్యనారాయణ నరసింహ స్వామీ బోగే ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment