Thursday, 21 January 2016

విచారణ జరిపి శిక్షపడేలా చూడాలి ------ ---ఎ ఐ ఎస్ ఎఫ్

విచారణ జరిపి శిక్షపడేలా చూడాలి ------ ---ఎ ఐ ఎస్ ఎఫ్



రెబ్బెన: (వుదయం ప్రతినిధి) హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి చెందిన పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్య పై పారదర్శకంగా విచారణ జరిపింఛి శిక్ష పడేలా చూడాలని ఎ ఐ ఎస్ ఎఫ్ ఆధ్వర్యములో స్థానిక అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని మంగళవారము ఇచ్చారు . ఈ సందర్భంగా ఎ ఐ ఎస్ ఎఫ్ జిల్లా వర్కింగ్ అధ్యక్షుడు దుర్గం రవీందర్ మాట్లాడుతూ బీజేపీ మంత్రి దత్తాత్రేయ ఉత్తరం రాయడంతోనే యూనివర్సిటీలో వివాదం చెలరేగిందని, దాంతో సస్పెన్షన్‌కు గురైన రోహిత్‌ మనస్థాపానికి లోనై ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ఎస్సి ఎస్టి అట్రాసిటి కేసులు పెట్టి వారిని మంత్రి పదవి నుండి తిలగించాలని వారు డిమాండ్ చేశారు . ఈ కేసు పై సీబీ సీఐడీచే విచారణ జరిపించి రోహిత్‌ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమములో ఎ ఇఎస్ ఎఫ్ మండల కార్యదర్శి పుదరి సాయి ఉపాధ్యక్షులు ప్రదీప్ నాయకులు నరేష్ సాయి శ్రావణ్ విద్యార్థులు పాల్గొన్నారు  

No comments:

Post a Comment