కుక్కలా దాడిలో 7 గొర్రెలు మృతి -25 గొర్రెలు గాయాలు
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలములోని వరదల గూడా కు చెందినా గురిజాల చెంద్రయ్య -తారా కు చెందినా గోర్రేలపై గురు వారం రాత్రి కుక్కలు దాడి చేయాగా 7 గొర్రెలు మృతి చెందగా , 25 గొర్రెలు గాయ పడ్డాయి . గురు వారం రాత్రి ఎక్కడి నుండి కుక్కలు వచాయో కాని మా పాలిట శాపంగా మారాయని చెంద్రయ్య ,తారలు లబో దిబో అంటూ ఏడ్చారు . ఈ విషయాన్ని రెబ్బెన తహసిల్దార్ రమేష్ గౌడ్ కు తెలిపారు .ఆయన స్పందుస్తూ వెంటనే పశువుల డాక్టర్ సాగర్ కు ఫోన్ చేసి వెంటనే పంచనామా చేయాలని , రిపోర్టు ను పంపిచాలని తెలిపారు. ఈ రిపోర్టు వచ్చిన తరువాత సబ్ కలెక్టరుకు పంపించి నష్ట పరిహారము వచ్చేల చూస్తామని తెలిపారు. ఈ సందర్భంగా యాన మాట్లాడుతూ పల్లెలలో రైతులు, పశువుల పెంపకపుదారులు జాగ్రతగా పశువుల కొట్టములలో ఉంచాలని అన్నారు .