కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) జనవరి 4 ; సావిత్రి బాయి ఫూలే జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ డిమాండ్ చేశారు. బుధవారం రోజున సావిత్రి బాయి ఫూలే జయంతి సందర్భంగా రెబ్బెనలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏఐఎస్ఎఫ్ ఆద్వర్యంలో జయంతిని ఘనంగా నిర్వహించారు. అనంతరం రవీందర్ మాట్లాడుతూ మహిళలకు విద్యను దూరం చేసి వారిని వంటింటికి పరిమితం చేసిన రోజులల్లో మహిళలకు విద్యను అందించాలనే ఉద్దేశంతో 1848లో పూణెలో మొట్టమొదటి బాలికల పాఠశాలను ప్రారంభించారు. అగ్రవర్ణ బ్రహ్మణుల నుండి అవమానాలు, దాడులు ఎదుర్కొని బాలికలకు విద్యను అందించి పురుషులకు సమానంగా మహిళలకు హక్కులు కల్పించాలని మహిళల పక్షాన పోరాటం చేసిందని గుర్తు చేశారు. ఈరోజు మహిళలు అనేక హక్కులను పొందుతున్నరంటే సావిత్రి బాయి ఫూలే పోరాట ఫలితామే అని అన్నారు. ఇప్పటికి దేశంలో మహిళలపై, విద్యార్థినిలపై అనేక విధాలుగా దాడులు జరుగుతున్నయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాళితులపైన పెరిగాయని అన్నారు. మహిళల రక్షణ కొరకు మరిన్ని చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి పూదరి సాయి, మండల కార్యదర్శి పర్వతి సాయి, స్వప్న ,అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment