కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) జనవరి 4 ; మధ్యాన్న భోజన కార్మికులు ఈ నెల 17న జరుప తలపెట్టిన ఒకరోజు సమ్మె నోటీసు ను రెబ్బెన మండల ఎం ఈ ఓ కు గురువారం అందచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వివిధ పథ కాలలో పనిచేస్తున్న కార్మికులకు 45 వ ఇండియన్ లేబర్ సిఫార్సులను అమలు చేయాలనీ డిమాండ్ చేస్తూ కేంద్ర, రాష్ట్ర సంఘాలు ఒక రోజు సమ్మె తలపెట్టిన నేఫధ్యంలో ఈ నోటిస్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. అనంతరం తెలంగాణ మధ్యాన్నం భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా సెక్రటరీ పగిది మాయ మాట్లాడుతూ తమను కార్మికులుగా గుర్తించాలని , కార్మికుల జీతాలు కనీసం 18,000 కు పెంచాలని, పని ప్రదేశాలలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ సమ్మె చేయనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సెక్రటరీ పగిది మాయ ,మండల సెక్రటరీ విజయ, శాంతాబాయి, రాజేశ్వరి, రాజాబాయి, శాంతా, తనుబాయి, పొశుబాయి, చిన్నుబాయి , తారాబాయి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment