నిరుపేదలకు 3 ఎకరాల భూమికై వినతి
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 22; ప్రభుత్వ భూమిని నిరుపేదలైన లబ్దిదారులకు ఇప్పించాలని ఎం ఎల్ ఏ కోవలక్ష్మి కి సోమవారం ఆసిఫాబాద్ లోని స్వగృహంలో తెరాస జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెబ్బెన ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ ల ఆధ్వర్యంలో వినతిపత్రం అందచేశారు. అనంతరం మాట్లాడుతూ రెబ్బెన మండలం కొమురవెల్లి గ్రామస్తులు 16 మంది తమ గ్రామా శివారు లోని సర్వే నెంబర్ 189 లోగల 17 ఎకరాల ప్రభుత్వ భూమిని నిరుపేదలైన లబ్దిదారులకు 3 ఎకరాల చొప్పున భూమిని పంపిణి చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో ,మాజీ ఉప సర్పంచ్ పరకాల శ్రీనివాస్ గౌడ్ , తెరాస నాయకులూ వాడ్నల రమేష్, పెద్దింటి మధుకర్, పరకాల సాగర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment