కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) జనవరి 4 ; లంబాడాలకు ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాల జారీని నిలిపివేయాలని రెబ్బెన మండలం ఆదివాసీ కొలవార్ సేవా సంఘం అధ్యక్షుడు ఎం మైలారపు శ్రీనివాస్ రెబ్బెన తహశీల్దార్ డి విష్ణుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ లంబాడాలు భారత రాజ్యాంగం 1950 ఆర్టికల్ 342 (క్లాజ్ -1) ప్రకారం ఎస్టీ జాబితాలో నమోదు కాకుండానే 1976 లో దొడ్డిదారిన వచ్చి ఎస్టీ కుల ద్రువీకరణ మరియు ఏజెన్సీ ధ్రువీకరణ పత్రాలు పొందుతూ విద్య వైద్య ఉద్యోగ ఉపాధి రాజకీయ ఆర్థిక రంగాల్లో ఆదివాసీల రిజర్వేషన్ల ఫలాలను కొల్లగొట్టుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్, సెక్రటరీ పోచమల్లు ,ఈ గోపాల్, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment