Friday, 5 January 2018

కందుల కొనుగోలు కేంద్రాల ఈ నెల 17 న ఏర్పాటు

కందుల కొనుగోలు కేంద్రాల ఈ నెల 17 న  ఏర్పాటు 

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి)  జనవరి 5 ;   రైతుల సౌకర్యం కోసం కొమురంభీం జిల్లాలో కందుల కొనుగోలు కేంద్రాలను ఈ నెల 17న ఏర్పాటు చేయనున్నట్లు సంయుక్త పాలనాధికారి అశోక్ కుమార్ గురువారంనాడు తన కార్యాలయంలో  అధికారులతో జరిగిన సమావేశంలో తెలిపారు. రైతుల సౌకర్యం కోసం జిల్లాలోని ఆసిఫాబాద్, కగజనగర్, సిర్పూర్((ఎం) జైనూర్, లలో ఈ నెల 17, 18 తేదీలలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రైతులకు మద్దతు ధర 5450 గ నిర్ణయించినట్లు, రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించి కందులను కేంద్రాలల్కు తీసుకొనిరావాలన్నారు. రైతులు వస్తున్నప్పుడు ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, ఏ  ఈ ఓ ,ఎం ఈ ఓ ధ్రువీకరణ పత్రాల నాకళ్ళను తీసుకోని  అన్నారు. ఈ సమావేశంలో మార్కెఫెడ్ డి ఎం గౌరీ శంకర్, జిల్లా పౌర సరఫరాశాఖ మేనేజర్ గోపాల్, జిల్లా సహకార సంస్థ అధికారి మద్దిలేటి , డి పి  ఓ ర్బాని, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment