Friday, 15 December 2017

ఎన్నికల హామీలను విస్మరించిన తెరాస ప్రభుత్వం

ఎన్నికల హామీలను విస్మరించిన తెరాస ప్రభుత్వం 
  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) డిసెంబర్ 15 :సాధారణ ఎన్నికల సమయంలో విద్యారంగంలో అనేక మార్పులు తీసుకువస్తాము అని వాగ్దానాలు చేసి తీర హామీలను తెరాస విస్మరించందని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ అన్నారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారంనాడు రెబ్బెన మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి ఏఐఎస్ఎఫ్ నాయకులూ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా దుర్గం రవీందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేజీ టూ పీజీ ని అమలు చేయకుండా కాకమ్మ కధలు చెపుతూ కాలం వెల్లదిస్తున్నారని ఆరోపించారు. పెండింగులో ఉన్న ఫీజు రియింబర్స్మెంట్, ఉపకారవేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉండడం వలన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిద శాఖలలోఉన్న ఉద్యోగుల ఖాళీలను వెంటనే భర్తీ చెయ్యాలని, ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు విడుదల చేసి రాష్ట్రంలోని నిరుద్యోగా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అన్నారు. టిఆర్టీ నోటిఫికేషన్ విడుదల అసమర్థత తో ఉన్నదని,  సక్రమమైన ప్రణాళిక లేకపోవడం వలనే అనేక ఇబ్బందులు ఎదురౌతున్నాయన్నారు ప్రైవేట్,కార్పొరేట్ విద్య సంస్థలు విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ, వారిని మానసికంగా వేధిస్తున్నారని, ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకుంటే వాటిని నియంత్రించకుండ వాటికే ఈ ప్రభుత్వం కొమ్ముకాస్తున్నదని  అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి పూదరి సాయికిరణ్,జిల్లా కార్యవర్గ సభ్యులు కె.కమలాకర్, మండల అధ్యక్షుడు మలిశెట్టి మహిపాల్, మండల కారదర్శి పర్వతి సాయికుమార్, రెబ్బెన గ్రామ అధ్యక్షుడు బెజ్జంకి అనుదీప్, ప్రశాంత్, అరుణ్ సాయి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment