కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 19 ; రెబ్బెన: కొమురం భీం జిల్లా రెబ్బెన మండలం రెబ్బెన గ్రామ పంచాయితీ పరిధిలో శుక్రవారం పంచాయితీ సానిటరీ విభాగం వారు సర్పంచ్ పేసరి వెంకటమ్మ ఆధ్వర్యంలో గ్రామంలోని మురుగు నీటి కాల్వల శుద్ధి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మురికి కాల్వలలో చెత్త చెదారం నిండిపోవడంవల్ల మురుగు నీరు సరిగా పారక నిల్వఉండి దోమలు వృద్ధి చెందుతున్నాయని, గ్రామస్తులు మురుగు కాల్వలలో ప్లాస్టిక్ సీసాలు తదితర చెత్త వేయకుండా గ్రామ పరిశుభ్రతకు తోడ్పడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన సింగల్ విండో చైర్మన్ పెసరి మధునయ్య,గ్రామా పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment