కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 25 ; రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామ శివారులోని బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 9 తేదీనుండి 11 తేది వరకు నిర్వ హించే జాతర నిర్వహణలో అధికారులు అప్రమత్తంగ ఉండాలని ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్,ఎమ్మెల్యే కోవా లక్ష్మిలు సూచించారు.గురువారం గంగాపూర్ దేవాలయం వద్ద జరిగిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ మండలంలోని అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ,ఎమ్మెల్సీ ,ఏమ్మెల్యే మాట్లాడుతూ వైద్యసదుపాయం,త్రాగునీరు,ఆ ర్. టి . సి .బస్సు సౌకర్యం,విద్యుత్ సౌకర్యం పారిశుధ్యం, ట్రాఫిక్ కంట్రోల్, ఎన్ఎస్ఎస్ సేవల అంశాలపై నిరంతరం పర్యవేక్షించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు.అదే విధంగా త్రాగునీరు నిరంతరం అందించాలని గ్రామీణ నీటి పారుదల శాఖను ఆదేశించారు.జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అన్ని శాఖల అధికారులు,ప్రజాప్రతినిధులు,ప్రజలు జాతర విజయవంతానికి సహకరించాలని కోరారు,ఈ సమావేశంలో రెబ్బెన సిఐ పురుషోత్తం, , జడ్పిటిసి బాబురావు, ఎంపీటీసీ కర్నాధం సంజీవ్ కుమార్ ఎంపిడిఓ సత్యనారాయణసింగ్, , సింగరేణి బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ రవిశంకర్, గంగాపూర్ సర్పంచ్ రవీందర్, ఆలయ కమిటీ అధ్యక్షులు లక్ష్మణ్,, ఐ సి డి ఎస్ పీడీ సావిత్రి, పీడీ శంకర్, ఏపీఎం వెంకటరమణ శర్మ, ఏ పి ఓ కల్పన, పంచాయితీ సెక్రటరీ మురళీధర్, పాక్స్ చైర్మన్ మధునయ్య, రెబ్బెన ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, ఆలయ ఎగ్జిక్యూటువే ఆఫీసర్ బాపి రెడ్డి , తెరాస నాయకులూ పోటు శ్రీధర్ రెడ్డి, చిరంజీవి గౌడ్ , అరున్ , తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment