కొమురం భీం జిల్లా (వుదయం ప్రతినిధి ) జనవరి 16: తెలంగాణ ప్రభుత్వం బ్రాహ్మణ కులస్తులకు చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాలను వినియోగించుకొవడానికి బ్రహ్మాణులు తమ కుల , ఆదాయ ధ్రువీకరణ పత్రాలకు ధరఖాస్తుచేసుకోవాలని రాష్ట్ర బ్రాహ్మణ సంఘ ప్రధాన కార్యదర్శి మొగులూరి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం రెబ్బెన మండలకేంద్రంలోని అతిధి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ లోని బ్రాహ్మణ కులస్తుల సంక్షేమేం కోసం సంవత్సరానికి 100 కోట్ల నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఎం ఎల్ ఏ కోవ లక్ష్మి చేతుల మీదుగా కొమురం భీం జిల్లా కేంద్రం అసిఫాబాద్లో ఈ నెల 22 న హెల్ప్ సెంటర్ ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా లోని బ్రాహ్మణ కులస్తులందరు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలనీ కోరారు. ఈ కార్యజక్రమంలో మోడెమ్ సుదర్శన్ గౌడ్, బొమ్మినేని శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment