జాతిపితకు శ్రద్ధాంజలి
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 30 ; జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం ఉదయం 11 గంటలకు కొమురంభీం జిల్లాలోని అన్ని మండలాల్లో రెండు నిముషాలు మౌనం పాటించి భారత స్వతంత్ర సంగ్రామంలో అమరులైన వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్లో జిల్లా పాలనాధికారి కార్యాలయం ఎదుట అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు రెండు నిముషాలపాటు మౌనం పాటించి నివాళు లర్పించారు. . రెబ్బెన మండలం కేంద్రంలో ప్రధానకూడలిలో రెండు నిముషాలు మండల తహసీల్దార్, రెబ్బెన స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో గ్రామస్తులు మానవహారంగా ఏర్పడి మౌనం పాటించి బాబుజీ కి నివాళులు అర్పించారు.
No comments:
Post a Comment