కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) జనవరి 5 ; పశువులకు గాలికుంటూ వ్యాధుల నివారణ కొరకు టీకాలు తప్పని వేయించాలని పశువైద్యాధికారి డాక్టర్ సాగర్ అన్నారు. రెబ్బెన మండలంలోని ఎడవల్లి మరియు ఖైర్గం గ్రామాలలో శు క్రవారం వేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముందస్తు చర్యలుగా వ్యాధిని గుర్తించి టీకాలు వేయడం వల్ల గాలికుంట వ్యాధులను నివారించవచ్చని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మొత్తం 285 పశువులకు టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం పి టి సీ కర్నాధం సంజీవ్, ఖైర్గం గ్రామా సర్పంచ్ కర్నాధం సులోచన పశు వైద్య సిబ్బంది తదితరలున్నారు.
No comments:
Post a Comment