Wednesday, 24 January 2018

సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు

 కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 24;  రెబ్బెన మండలం వృత్త పర్యవేక్షణాధి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో   ఆసిఫాబాద్ డిప్యూటీ సూపరింటెండెంట్ అఫ్ పోలీస్ సత్యనారాయణ మాట్లాడుతూ నేరాల అదుపునకు నిఘా కెమెరాలు ఎంతగానో ఉపకరిస్తాయని అన్నారు. రెబ్బెన  పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని వాణిజ్య సముదాయాలు తప్పని సరిగా 15 రోజులలో నిఘా కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఎవరైనా సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే  సహించబోమని, చట్ట పరంగా కఠిన చర్యలు తప్పవన్నారు. కిరానా,టీ స్టాళ్లలో నిషేదిత గుట్కాలు తదితర వస్తువులు వ్యాపారులు అమ్మరాదన్నారు. రెబ్బెన పరిధిలో ప్రధాన రహదారిపై ఉన్నడా బాలు  తదితర హోటళ్లు రాత్రి 10  వరకే వ్యాపారాలు నిర్వహించాలన్నారు. ఎవరైనా అపరిచితులు వస్తే వారి పేరు, మొబైల్ నెంబర్ ప్రయాణించిన వాహనం నెంబర్ ఒక రిజిస్టర్ లో నమోదు చేయాలన్నారు.  ఈ కార్యక్రమంలో రెబ్బెన  సర్కిల్ ఇన్స్పెక్టర్ పురుషోత్తమ చారి, సుబ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ మరియు ఇతర అధికారులు, రెబ్బెన వ్యాపారస్తులు  పాల్గొన్నారు. 

No comments:

Post a Comment