కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 24; వేకువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు రెబ్బెనలోని జిల్లా పరిషత్ పాఠాశాల 9,10 వ తరగతి విద్యార్థులకు ఏకాగ్రత,జ్ఞాపకశక్తి, లక్ష్యం ,సమయపాలన మరియు మానవతా విలువలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో ప్రముఖ సైకాలజిస్ట్ డి శ్రీనివాసులు విద్యార్థులనుద్దేశించి పై విషయాలను విశదీకరించారు. ప్రధానోపాధ్యారాలు శ్రీమతి సి స్వర్ణలతమాట్లాడుతూ శ్రీనివాసులు చెప్పిన విషయాలు విద్యార్థుల జీవితాలను ఎంతగానో ప్రభావితం చేస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విజయలక్ష్మి, సీమ, ఆలిస్ అహ్మద్, రోజా రమణి, కవిత,పార్వతి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment