- 4,06,100 /- రూపాయలు, 6 మొబైల్ ఫోన్ లను స్వాదినం
కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 28 ; కుమ్రం భీమ్ జిల్లా కాగజ్ నగర్ ప్రాంతం లో గత కొంతకాలంగా దొంగ నోట్లను చలామణి చేసే ముఠాను ఆదివారం అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పి కల్మేశ్వర్ సింగేనవార్ మీడియా ప్రతినిదులకు వెల్లడించారు. జిల్లా లోని స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్ నందు గల పోలీస్ సమావేశ మందిరము లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పి మాట్లాడుతూ 6 గురు నిందితులు గల ముఠా జిల్లా లోని కొన్ని ప్రాంతాలలో నఖిలి నోట్లు చలామణి చేస్తుండగా పక్కా సమాచారం తో వారిని పట్టుకోవడం జరిగిందని తెలిపారు. విలాసవంతమైన జీవితం కోసం నిందితులు ఒక ముఠా గా ఏర్పడి 100 దొంగనోట్లకు 30 అసలు నోట్లు గా చలామణి చేసేలా ఒప్పందం తో 4,06,100/- తో కాగజ్ నగర్ వచ్చి 1,72,300/- ఇచ్చి మిగితా నకిలీ నోట్లుతో బస్సు లో అక్కడ నుంచి వెళ్లి పోయారు . 27.01.2018 నాడు నమ్మదగిన సమాచారం మేరకు కాగజ్ నగర్ పోలీసులు , స్పెషల్ బృందం తో పక్క ప్రణాళిక తో వల పన్నిముగ్గురు నిందితులను రైల్వే స్టేషన్ ఏరియా నందు, మిగతా ముగ్గురిని బస్సు స్టేషన్ సమీపమందు పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. మరియు వారి దగ్గర గల మొత్తం నకిలీ నోట్లవిలువ 4,06,100 /- రూపాయలు, 6 మొబైల్ ఫోన్ లను స్వాదినం చేసుకొని వారిని అదుపులోకి కేసు నమోదు చేయడం చేయడం జరిగిందన్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Sunday, 28 January 2018
దొంగ నోట్ల చలామణి చేసేతున్నముఠా అరెస్ట్
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment