Friday, 12 January 2018

ఎస్ వి ఇంగ్లిష్ మీడియం హై స్కూల్ లో ముగ్గుల పోటీలు

                                                                      
        కొమురం భీం జిల్లా (వుదయం ప్రతినిధి ) జనవరి  12:    రెబ్బెన లోని సాయి విద్యాలయం ఇంగ్లిష్ మీడియం హై స్కూల్ (ఎస్ వి స్కూల్ ) లో విద్యార్థులకు  ముగ్గుల పోటీలు నిర్వహించారు .ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ కుందారం శంకరమ్మ పాల్గొన్నారు . విద్యార్థినిలు రంగు రంగుల ముగ్గులతో రంగవల్లికలను ఎంతో అందంగా వేశారు . ప్రతి సంవత్స్తరం విద్యార్థులకు మన సాంప్రదాయాన్ని  కోసం ఇలాంటి పోటీలు నిర్వహిస్తున్నట్లు పాఠశాల కరెస్పాండెంట్ ఢీకొండ సంజీవ్ కుమార్ తెలిపారు . న్యాయ నిర్ణేతలుగా ఏ  పి ఓ కల్పనా , ఏ ఈ ఓ అర్చన , టెక్నీకల్ అసిస్టెంట్ జయ లతో పాటు ఉప సర్పంచ్ శ్రీధర్ , వార్డ్ మెంబర్ చిరంజీవి గౌడ్ లు ఉన్నారు. ముగ్గులు అందరిని ఆకట్టు కున్నాయి . అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు . ఈ కార్యక్రమములో వార్డ్ మెంబర్  ఉబేదుల్లా , ఉపాధ్యాయులు సుజాత , రేష్మ , ఉదయ , విజయ లక్ష్మి , విద్యా సాగర్ , లీల , మంగమ్మ , రాజ్ కుమార్, విద్యార్థులు  లు పాల్గొన్నారు . 

No comments:

Post a Comment