కొమురం భీం జిల్లా (వుదయం ప్రతినిధి ) జనవరి 12: టీడీపీ నేత రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు ప్రతాప రెడ్డి అక్రమ అరెస్టును కొమురంభీం జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షులు గుళ్ళపల్లి ఆనంద్ తీవ్రంగా ఖండించారు. శుక్రవారం రెబ్బెన విశ్రాంతి గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కెసిఆర్ నాయకత్వంలోని తెరాస పార్టీ రాష్ట్రంలో టీడీపీ నాయకులను అక్రమంగా అరెస్టులు చేసి బెదిరింపులకు దిగుతున్నదన్నారు. రెండునెలల క్రితం కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వెల్ కు చెందిన విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీలో ఆత్మహత్య సందర్భంగా పరామర్శకు వెళ్లిన టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు ప్రతాప రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసారని, రాష్ట్ర డి ఐ జి ని కలిసిన తరువాత విడుదల చేసారని మరల రెండు రోజుల క్రితం అకారణంగా,అనైతికంగా అక్రమంగా అరెస్ట్ చేసారని, అతనిని బేషరతుగా విడుదల చేయాలనీ డిమాండ్ చేసారు. ఈ కార్య క్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు సొల్లు లక్ష్మి జిల్లా ఎస్ సి సెల్ అధ్యక్షులు దుర్గం మాధవ్,నాయకులు విజయ్, నాందేవ్, మనోహర్, రాము,రమ, ప్రమోద్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment