కొమురం భీం జిల్లా (వుదయం ప్రతినిధి ) జనవరి 12: సింగరేణి బెల్లంపల్లి ఏరియా లో శాంప్లింగ్ మజ్దూర్ ఖాళీలను భర్తీచేయడానికి శుక్రవారం గోలేటి జనరల్ మేనేజర్ కార్యాలయ ఆవరణలో రాత పరీక్ష నిర్వహించారు. ఏరియాలో ఉన్న 9 పోస్టులకు గాను 26 మంది హాజరయ్యారని జనరల్ మేనేజర్ కిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. పదోన్నతులకై నిర్వహించిన ఈ పరీక్ష కు మౌఖిక పరీక్షా లేకుండా పూర్తి పారదర్శకతతో నిర్వహించినట్లు తెలిపారు. ఈ పరీక్షా నిర్వహణలో ఎస్ ఓ టూ జి ఎం ఎం ,శ్రీనివాస్,డి జి ఎం పర్సనల్ కిరణ్, అధికారులు సుదర్శనం, రాయమల్లు, యూహన్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment