కొమురం భీం జిల్లా (వుదయం ప్రతినిధి ) జనవరి 16: తెరాస పార్టీ తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి పల్లె పల్లెకు తెలుగుదేశం కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు టీడీపీ జిల్లా అధ్యక్షులు గుళ్ళపల్లి ఆనంద్ అన్నారు. మంగళవారం ఆసిఫాబాద్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి ఐన జనవరి 18 నుండి టీడీపీ ఆవిర్భావ దినోత్సవం 27మార్చ్ వరకు 70 రోజుల పటు పల్లె పల్లెకు తెలుగు దేశం పల్లెబాట కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాన్ని సామాన్య ప్రజలకు వివరిస్తూనే తెలుగు దేశం పార్టీ వ్యవస్థను పల్లె పల్లెల బలపరచాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల టీడీపీ ఉపాధ్యక్ష్యులు బొన గిరి మురళి, ప్రధాన కార్యదర్శి పి ఆత్మారాం, జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు సొల్లు లక్ష్మి , తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు ఎం సుధాకర్, జిల్లా మైనారిటీ అధ్యక్షులు బాపు, నాయకులూ తాజ్ బాబా, డెలత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment