కొమరంభీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) జనవరి 28 ; రెబ్బెన: ప్రధానమంత్రి నరేంద్రమోడీ అమలు చేస్తున్నప్రజా సంక్షేమ పథకాలు, అవినీతి రహిత పాలనను దృష్టిలో పెట్టుకొని రెండు వేల పందొమ్మిదిలో జరిగే ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యం గ పనిచేయాలని కార్యాలకర్తలకు జిల్లా అధ్యక్షుడు జెపి పడేల్ పిలుపునిచ్చారు. . ఆదివారం రెబ్బెన మండలం గోలేటి భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమితులైన డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ ని సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి పేద ప్రజలకు ఎన్నో నిధులు ప్రధాని నరేంద్రమోడీ కేటాయిస్తున్నారని ఏ పార్టీ ఎలాంటిదో ప్రజలకు తెలుసు అని రెండు వేల పందొమ్మిదిలో జరిగే ఎన్నికల్లో బిజెపి పై స్థానంలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కేసరి ఆంజనేయులుగౌడ్. టాకుర్ విజయ్ సింగ్. జిల్లా ఉపాధ్యక్షులు వై క్రుష్ణ కుమారి. జిల్లా కార్యదర్శి అన్నపూర్ణ సుదర్శన్ గౌడ్ ఆసిఫాబాద్ అసెంబ్లీ కన్వీనర్ గుల్బం చక్రపాణి. సిర్పూర్ కాగజ్ నగర్ అసెంబ్లీ కన్వీనర్ కోంగ సత్యనారాయణ. తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment