Saturday, 29 April 2017

అగ్ని ప్రమాదానికి బారి ఆస్తి నష్టం

       అగ్ని ప్రమాదానికి బారి ఆస్తి నష్టం 


కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  ఏప్రిల్  29 ; (వుదయం ప్రతినిధి) ;   రెబ్బెన మండలం లోని నారాయణపుర్ ఏ సి కాలనీలో  లో ప్రమాధవశాత్తు ఏడు ఇళ్లకు నిప్పు అంటుకొని బారి ఆస్తినష్టం జరిగినట్లు రెబ్బెన కార్యాలయ సిబ్బంది ఆర్ ఐ అశోక్ చౌహన్, గ్రామాధికారి ఉమ్ లాల్ లు  తెలిపారు. శనివారం ఉదయం సుమారు 11గంటల ప్రాంతం లో ఊరిలో బంధువుల ఇంట్లో పెళ్ళికి వెళ్లగా అకస్మాత్తుగా ప్రమాదం జరిగిందన్నారు. దుర్గం సోమయ్య, దుర్గం శంకర్, దుర్గం రాంచందర్, దుర్గం కృష్ణ, దుర్గం, లక్ష్మణ్  జాడి లక్ష్మయ్య  ఇల్లు పూర్తిగా దహనం అయ్యాయని పేర్కొన్నారు.  సుమారు నాలుగు లక్షల తొంబై రెండు వేల విలువైన  ఆస్తి  నష్టం జరిగిందని అన్నారు. ఆస్తితో పటు ముగా జీవులు ఆయన ఆవు,మేకలు కూడా ఉన్నట్లు స్థానికులు అంటున్నారు.  సంఘటన స్థలానికి ఆసిఫాబాద్ అగ్ని మాపక సిబ్బంది చేరుకునే లోపల పూర్తిగా దహనం అయి పోయాయి.  స్థానికంగా ఉన్న అగ్ని ని చల్లార్చారు సంఘటన స్థలానికి మండల నాయకులు  పరిశీలించి బాధితులకు స్వల్ప సహాయం కింద వంట సామగ్రి పంపిణి చేశారు. మండలం లో అగ్ని మాపక దళ శిబిరాలు కేటాయించాలని మండల వాసులు కోరుకుంటున్నారు.ఏ  విధమైన  అనుకోని అగ్ని  ప్రమాదాలు జరిగినపుడు దూర భారం నుండు అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు ప్రమాదం కాస్త జరిగిపోతుంది అని, మండలం లోనే అగ్ని మాపక సిబ్బంది ఉంటె సకాలంలో అరికట్టచ్చు అంటున్నారు.  

No comments:

Post a Comment