Saturday, 29 April 2017

శివాలయ వార్షికోత్సవం సందర్బంగా ప్రత్యేకపూజలు

శివాలయ వార్షికోత్సవం సందర్బంగా ప్రత్యేకపూజలు 

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  ఏప్రిల్  29 ; (వుదయం ప్రతినిధి) ;   రెబ్బెన మండలం నంబాలలోని శ్రీ ప్రసన్న పరమేశ్వరాలయం ఆలయ వార్షికోత్సవం సందర్బంగా శనివారం ఆలయ వార్షికోత్సవ ఉత్సవం ఘనంగా  నిర్వహించారు.  ఈ సందర్బంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శివుడి కి రూద్రాభిషేకం,మృత్యుంజయ హోమం,రుద్రహోమం పశుపతి హోమంలను జరిపారు ఈ పూజలను వీక్షించడానికి మండలం లోని ప్రజలు భారీ సంఖ్యలో హాజరు అయి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.  ఈ కార్యక్రమం లో నంబాల సర్పంచ్ గజ్జెల సుశీల , సింగిల్ విండో డైరెక్టర్ గజ్జెల సత్యనారాయణ ,   ఆలయ కమిటీ అధ్యక్షులు పూదరి వెంకటేష్, కమిటీ సభ్యులు పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.   

No comments:

Post a Comment