Wednesday, 26 April 2017

నిత్యం మహంకాళికి పూజలు

నిత్యం మహంకాళికి పూజలు 

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  ఏప్రిల్  26 ; (వుదయం ప్రతినిధి) ;   రెబ్బెన  మండల కేంద్రం  లోని ఇందిరా నగర్ గ్రామంలో వెలసిన మహంకాళి దేవత అనునిత్యం అశేష పూజలు అందుకుంటుంది, మండలంలోని భక్తులే కాకుండా ఆసిఫాబాద్ , కాగజనగర్ , రెబ్బెన తాండూర్, తిర్యాణి, తదితర మండలాల నుండి ప్రతిరోజు భక్తులు వస్తూపోతూ ఉంటారు . గత నాలుగు సంవత్సరాల నుండి నిత్యం పూజారి దేవరా వినోద్ ఆధ్వర్యం లో జరుగుతుంటాయి. మీ 2వరకు జాతర జరగుతుందని ,   మే నెలలో న మహంకాళి దేవత పుట్టిన రోజు సందర్బంగా ప్రత్యేక పూజలు , కుంకుమార్చనలు నిర్వహించబడతాయని , చుట్టూ పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు తీర్చుకోవాలని పూజారి వినోద్, ఆలయ కమిటీ అధ్యక్షలు మోడెమ్ తిరుపతి తెలిపారు.

No comments:

Post a Comment