బొగ్గు లారీలో అక్రమముగా తరలిస్తున్న కలప పట్టివేత
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన ఏప్రిల్ 13 ; అక్రమంగా తరలిస్తున్న కలప దిమ్మలు గురువారం రాత్రి డోర్లి నుంచి గోలేటి మీదుగా రెబ్బెన వైపు టీఎస్ 04 యు బి 2239 నంబర్ గల బొగ్గు లారీ వాహనం లో తరలిస్తుండగా డీఎఫ్ ఓ వెంకటేశ్వర్లు సమాచారమేరకు రెబ్బన మండలం లోని గోలేటి క్రాస్ వద్ద మాటు వేసి స్వాధీన పరుచుకున్నట్లు అటవి క్షేత్ర అధికారి రాజేందర్ ప్రసాద్ , అటవీ క్షేత్ర ఉపాధికారి కే శ్రీనివాస్ లు తెలిపారు లారీ లో 17 టేకు దిమ్మలు వున్నాయి వీటి విలువ 47 వేల 117 రూపాయలు ఉంటుందన్నారు, వీరితో పటు బీట్ అధికారి భూక్యా రవి తదితర సిబ్బంది లు ఉన్నట్లు తెలిపారు.
No comments:
Post a Comment