Tuesday, 25 April 2017

యాదవులకు ప్రవేశపెట్టిన అభివృద్ధి అభివృద్ధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలి ; ఎంపీపీ సంజీవ్ కుమార్

 యాదవులకు ప్రవేశపెట్టిన అభివృద్ధి అభివృద్ధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలి 

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  ఏప్రిల్  25 ; (వుదయం ప్రతినిధి) ;  తెరాస ప్రభుత్వం  యాదవులకు ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ సంజీవ్ కుమార్, జడ్పీటీసీ బాబురావు లు అన్నారు. మంగళవారం రెబ్బెన మండలం కేంద్రం లోని ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులకు యాదవులకు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.మన ముఖ్యమంత్రి కెసిఆర్ గారు  75 శాతం సబ్సిడీ పై గొర్రెలను సంఘాలుగా ఏర్పడిన యాదవులకు పంపిణి చేయడం జరుగుతుందన్నారు యాదవ కులస్తులను బలోపేతం చేయడానికి ఈ పథకాలను ప్రవేశపెట్టామన్నారు.  గ్రామాలలో యాదవ కులస్తుల సొసైటీ  లను ఏర్పాటు చేసి  వారికీ గొర్రెలను పంపిణి చేయడం జరుగుతుందన్నారు ఒక్కొక యూనిట్ కు 20 ఆడ గొర్రెలతో పాటు ఒక మగ  గొర్రెపిల్లను అందజేయడం జరుగుతుందన్నారు. మొదటి విడత యాదవ సంఘాలకు సగం మందికి సబ్సిడీ అందజేయడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని యాదవులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు . అటవీ ప్రాంతంలో కూడా గొర్రెలను మేపడానికి అనుమతులు ఉన్నాయని గొర్రెల పెంచుకోవచ్చని సూచించారు . పశువుల సంరక్షణకు సంచార పశువైద్యశాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మండలంలో  గొర్రెల అమ్మకానికి ప్రత్యేక సంతలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యనారాయణ  సింగ్, తహసీల్దార్ రమేష్ గౌడ్, పశువైద్యాధికారి సాగర్, ఏపీఎం వెంకటరమణ శర్మ , సర్పంచులు పెసర వెంకటమ్మ , తోట లక్ష్మణ్ , రవీందర్,  భేమేష్, వెంకటేశ్వర్లు, ఏపీఓ కల్పన, ఎంపీటీసీలు వనజ , శ్రీనివాస్,మాజీ సర్పంచ్లు పర్వతాలు భగవాన్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment