పాము కాటుతో వ్యక్తి మరణం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఏప్రిల్ 22 ; (వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలం లోని జక్కలపల్లి మేడి హన్మంతు (40) పాము కాటుకు గురి అయి హాస్పటల్ కి తరలిస్తుండగా మార్గ మధ్యలో చనిపోయినట్లుగా బంధువుల పిర్యాదు మేరకు ఎస్ ఐ దారం సురేష్ తెలిపారు. పొలం పని నిమిత్తం వెళ్లిన మేడి హన్మంతు ఇంటికి రాకపోవడం తో శుక్రవారం ఉదయం ఆచూకీ కోసం అన్న కొడుకు రమేష్, బంధువులు వల్లి చూడగా పాముకార్చిందని తెలపడంతో ఆటో లో మంచిర్యాల్ హాస్పటల్ కి తరలించగా పరిశీలించి డాక్టర్లు చనిపోయారని తెలిపారు. బంధువుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూన్నట్లు తెలిపారు.
No comments:
Post a Comment