Monday, 24 April 2017

గ్రంధలయం పుస్తక పఠనం వాళ్ళ జ్ఞానం పెరుగుతుంది ; సింగరేణి డైరెక్టర్ బి. రమేష్ కుమార్


గ్రంధలయం పుస్తక పఠనం వాళ్ళ జ్ఞానం పెరుగుతుంది ; సింగరేణి డైరెక్టర్ బి. రమేష్ కుమార్

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  ఏప్రిల్  24 ; (వుదయం ప్రతినిధి) ;    గ్రంధాలయం పుస్తక పఠనం వల్ల జ్ఞానం పెరుగుతుంది అని సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్స్ బి. రమేష్ కుమార్ అన్నారు. బెల్లంపల్లి ఏరియా లోని గోలేటి టౌన్ షిప్ లో సింగేరేని సేవ సమితి అద్వర్యం లో నడిచే గ్రంధాలయాన్నీ సోమవారం ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. పుస్తక పఠనం అనేది మంచి అలవాటు. పుస్తక పఠనంతో జ్ఞానం పెరుగుతుందని,సింగరేణి సేవ సంస్థ ఏర్పాటు చేసిన గ్రంధాలయాన్ని వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రంలో  బెల్లంపల్లి జనరల్ మేనేజర్ కే రవిశంకర్, డిజిఎం చిత్తరంజన్ కుమార్,ఎస్ ఓ టూ జి ఎం కొండయ్య,ప్రాజెక్టు ఆఫీసర్ సంజీవ్ రెడ్డి,మోహన్ రెడ్డి, బి జి ఎం సివిల్ ప్రసాద్ రావు, డిజిఎం ఇ ఎక్స్ పి ఎల్ సీతారామారావు, ఏరియా ఇంజనీరింగ్ రామారావు, యూనియన్ నాయకులు టీబీజీకేఎస్ ఎన్. సదాశివ్ ఏఐటియూసి ఏరియా సెక్యూరిటీ బి. మోగ్లీ,బి వై పి ఎం ,రాజేశ్వర్, రామశాస్రి, సేవ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment