గీత కార్మికులను ఆదుకోవాలి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఏప్రిల్ 28 ; (వుదయం ప్రతినిధి) ; ఈతచెట్లు దహనం అయి గీతకార్మికులకు అన్యాయం జరిగిందని తెలంగాణ గౌడ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కేసరి ఆంజనేయులు గౌడ్ మంగళవారం రెబ్బెన తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ ఐ అశోక్ కి వినతి పత్రం అందచేసి మాట్లాడారు. రెబ్బెన మండలంలోని దుగ్గపూర్ శివారులో అయిదు వందల ఈత చెట్లు ప్రమాదవశాత్తు అగ్గికి ఆహుతి అయ్యాయని దీనితో 15గీత కార్మికుల కుటుంబాలు జీవనాధారం కోల్పోతున్నారని వీరిని ప్రభుత్వం గుర్తించి ఉపాధి కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అరిగేలా మధుకర్ గౌడ్,కేసరి సాయి గౌడ్ కొయ్యడ సత్యనారాయణ గౌడ్ కే. నారాయణ, కే. కైలాసం గౌడ్, కే.లష్మినారాయణ గౌడ్, కే. శ్రీనివాస్ గౌడ్, కే.బాపు గౌడ్, కే. కిసాన్ గౌడ్, చేపూరి నవీన్ గౌడ్ తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment