Wednesday, 19 April 2017

విద్యార్థులు కష్టబడి కాదు,ఇష్టపడి చదవాలి - ఎం ఎల్ సి పురాణం సతీష్,ఎం ఎల్ ఎ కోవలక్ష్మి


విద్యార్థులు కష్టబడి కాదు,ఇష్టపడి చదవాలి
 -ఎం ఎల్ సి పురాణం సతీష్,ఎం ఎల్ ఎ  కోవలక్ష్మి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం ప్రతినిధి)  ఏప్రిల్  19 ;  విద్యార్థులు కస్టపడి  కాకుండా ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహింహాలని   అధిరోహించాలని ఎం ఎల్ సి పురాణం సతీష్,ఎం ఎల్.ఎ కోవ లక్ష్మి అన్నారు.రెబ్బన మండలంలోని విశ్వశాంత్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 24వ వార్షికోత్సవం సందర్బంగా మంగళవారం రాత్రి వారు మాట్లాడారు.ముందుగా జ్యోతిప్రజాలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సంద్దర్బంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండే చదువు  పై ఆసక్తిని పెంపొందించుకోవాలన్నారు. క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించి తల్లిదండ్రులు,గురువులకు మంచి పేరు తీసుకురావాలన్నారు.సమైక్య రాష్ట్రం లో తెలంగాణ ప్రాంత విద్యార్థులకు విద్య ఉద్యోగ అవకాశాలలో సరైన గుర్తింపులను పొందలేకపోయారన్నారు. స్వరాష్ట్రంలో ఎన్నో అవకాశాలు మెరుగు పడ్డాయి. ఆయా అవకాశాలు సద్వినియోగం చేసుకోవడానికి ప్రణాళిక ప్రకారంగా చదువుకోవాలన్నారు. ఈ సమావేశం లో విజేతలకు భాహు మతులు అందచేశారు.అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక వృత్యాలతో పలువురిని  ఆకట్టుకున్నాయి.  ఈ కార్యక్రమం లో ఎం పి పి సంజీవు కుమార్, జెట్ పి టి సి బాబురావు,సర్పచ్ కేసర్ వెంకటమ్మ, సి ఐ మదన్ లాల్,ఏ ఎం సి కుందారపు శంకరమ్మ,నాయకులూ సుదర్శన్ గౌడ్,శ్రీధర్ రెడ్డి, చిన్న సోమా శేఖర్,రాపర్తి అశోక్, కరస్పాడెంట్ ఇప్ప పోచయ్య,ఉపాధ్యాయులు భారతి, జబీన్, సంగీత కుమారి,శేఖర్,ప్రసాద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment