Thursday, 13 April 2017

శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కల్యాణ మండపం భూమి పూజ


శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో  కల్యాణ మండపం  భూమి పూజ

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం) రెబ్బెన ఏప్రిల్  13 ; రెబ్బెన మండలంలో గంగాపూర్ గ్రామపంచాయితీ లో శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అభివృద్ధి కొరకు మంజూరైన నిధులు కల్యాణ మండపం కోసం  గురువారం రోజన ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ ,ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి  భూమి పూజ చేసారు వారు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు చేయలేనిది ఆలయ అభివృద్ధి పనులను తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది అని , తెలంగాణ రాష్ట్రంలో వున్నా  ఆసిఫాబాద్ కొమురం భీం జిల్లాలో గంగాపూర్ ఆలయాన్ని పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు  భక్తులు  తిరుపతి వెళ్లకుండా ఇక్కడే వెలిసిన శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి కి ముడుపులు చెల్లిస్తూ వల్ల కోరికలు తీర్చుతున్నాయి అని  భక్తుల ప్రగాఢ  నమ్మకం అని అన్నారు పురాతన కాలం నుంచి వస్తున్నా ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమి నాడు మూడు రోజుల పటు జరిగే జాతరకు  భక్తులు పక్క జిల్లాల నుంచి కూడా తాండాపో తండాలుగా వస్తారనిగుర్తించిన తెలంగాణ ప్రభుత్వం వసతుల కోసం నిధులను కేటాయించింది అని ,ముందు ముందు మరింత సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ పర్యాటక కేత్రముగా తీర్చి దిద్దుతా మన్నారు  ఈ కార్య క్రమములో ఎం పి  పి  సంజీవ్ కుమార్ , జెడ్ పి  టి సి బాబురావు,  హసీల్ధార్ బండారి రమేష్ గౌడ్, మార్కెట్ వైస్ ఛైర్మెన్ శంకరమ్మ, సర్పంచులు సుశీల , వెంకటమ్మ , లక్ష్మణ్ ,  నాయకులు సోమశేఖర్ ,  మలరాజ్ శ్రీనివాస్ రావు , సుదర్శన్ గౌడ్ , నవీన్ జైస్వాల్ , పోతూ శ్రీధర్ రెడ్డి, పల్లె రాజేశ్వర్, మధునయ్య, అశోక్, చిరంజీవి గౌడ్,  కోఆప్షన్ సభ్యుడు జాకీర్ ఉస్మాని, సింగల్ విండో డైరెక్టర్లు మధునయ్య, సత్యనారాయణ, గుడిసెల వెంకన్న గౌడ్,  తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment