రిజెర్వేషన్ల పేర్లతో మనోభావాలను దెబ్బతీయద్దు ; జె బి పొడెల్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 17 ; తెరాస ప్రభుత్వం ఓట్ల కోసం ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్ పేరిట హిందూ ముస్లింలకు వ్యతిరేక భావాన్ని తీసుకొస్తుందని కేవలం ఓట్ల లబ్దికోసమే చేస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు జేపీ పొడెల్ మరియు బీజేపీ నాయకులు సోమవారం కొమురం భీం జిల్లా కలెక్టర్ చంపాలాల్ కు వినతి పత్రం అందజేసారు ఆయన మాట్లాడుతూ కేవలం ఓట్ల లబ్ది కోసమే పన్నెండు శాతం రీజర్వేషన్ లు తెరపైకి తెచ్చి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి రిజర్వేషన్ ఆమోదించి హిందూ ముస్లింలు కలిసి మెలిసి సోదర భావం ఉన్నవారిని రాజకీయ ఓట్ల లబ్ది కోసం చిచ్చు పెడుతున్నారని అన్నారు. సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పుని రాజ్యంగా విరుద్ధంగా ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్ లు ప్రకటిచ్చినతీరుతో మానవ మనోబావలను దెబ్బతింటుదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బి జె పి నాయకులను,కార్యకర్తలను అరెస్ట్ చేయించటం సమంజసం కాదన్నారు.రాజ్యంగా విరుద్ధంగా తెరాస ప్రభుత్వందొరల పాలనా సాగిస్తుంది దినిని బి జె పి తీవ్రంగా ఖండిస్తుందని పేరుకున్నారు. ఎస్ టి రిజెర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వ్యతిరేకం కాదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖండ్రా విశాల్,సతీష్ తదితర నాయకులున్నారు.
No comments:
Post a Comment